తమను స్వగ్రామాలకు చేర్చండి అంటూ. నేతలకు వలస కూలీలు మొర
చెన్నైలో చిక్కుకొన్న రెండు వందల మంది కూలీలు
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
పొట్ట చేతపట్టుకొని వలస వచ్చాం కరోనా మహమ్మారి వ్యాపించడంతో పనులు నిలిచిపోయాయి రవాణా స్తంభించిపోయింది ఏమి చేయాలో పాలుపోవడం లేదని వలస కూలీలు చెన్నైలో ఆందోళన చెందుతున్నారు. ఏదోలా తమని స్వగ్రామాలకు చేర్చాలని ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కూలీలు చెన్నై భవన నిర్మాణ పనులకు వలసలు పోవడం సర్వ సాధారణం. ఇందులో భాగంగా చోడవరం చీడికాడ మాడుగుల రావికమతం మండలాలకు చెందిన కూలీలు కుటుంబాలతో సహా చెన్నైలోని ఆయినపాకం వేస్ట్ మొగపెర్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వివిధ నిర్మాణాల్లో పనులు చేస్తూ జీవిస్తున్నరు.ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించడంతో భయాందోళనలు చోటు చేసు కున్నాయి. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మరోపక్క కరోనా వైరస్ కారణంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. పనులు లేక ఉండలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తమను ఆదుకోవాలని వలస కూలీలు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులను అభ్యర్థిస్తున్నారు. సుమారు 200 కుటుంబాలు చెన్నైలో చిక్కుకుపోయారు. స్వగ్రామాలకు చేరు కొందామంటే రవాణా సౌకర్యం బందు అయింది. కూలి పనులు దొరక్క కర్ఫ్యూ లో రోడ్లపైకి రాలేక పస్తులు ఉంటున్నామని వలస కూలీలు వాపోతున్నారు. తమ పరిస్థితి అర్థం చేసుకుని ఏదోలా తమని స్వగ్రామాలకు చేర్చి పుణ్యం కొట్టుకోవాలని స్థానిక నేతలకు మొర పెట్టుకుంటున్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సహకారంతో తమను ఇళ్లకు చేర్చాలని వలస కూలీలు గ్రామాలకు ఫోను సందేశం పంపారు.
No comments:
Post a Comment