అనకాపల్లి , పెన్ పవర్ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పక్కాగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. ఉత్సవాలకి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన బుధవారం పరిశీలించారు. ఆలయ ఈవోకు, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. సాధారణ దర్శనం, విఐపి దర్శనాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. అన్నదానంలో భాగంగా పులిహోరా ,పెరుగన్నం ప్యాకెట్లు ఇవ్వాలని కోరారు. ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామనారు. కరొనా ప్రభావం నేపథ్యంలో తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సీఐ భాస్కర్, ఎస్సైలు రామకృష్ణ, సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
No comments:
Post a Comment