Followers

పొట్టి శ్రీరాముల త్యాగం ప్రజలందరికీ స్పూర్తి

(పెన పవర్ స్టాఫ్ రిపోర్టర్, కాకినాడ) అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం తెలుగు ప్రజలందరికి స్ఫూర్తి నిస్తుందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు 120వ జయంతి సందర్భంగా కాకినాడ, సిబియం సెంటర్ వద్ద నున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలక్టర్ జి లక్ష్మీ, డిఆర్‌డీ సిహెచ్ సత్తిబాబు, జెడ్ పిసిఇఓ యం జ్యోతిలు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు అమరణ నిరాహర దీక్ష చేసి అమరులైన పొట్టి శ్రీరాములు మహోన్నత వ్యక్తి అని తెలిపారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర సాధనతో పాటు భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీజీ అడుగు జాడల్లో నడిచిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములని కలెక్టర్ తెలిపారు. ఆయన యొక్క త్యాగానికి గుర్తిగా మన రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం గొప్ప విషయమన్నారు. పొట్టి శ్రీరాముల జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత స్పూర్తి పొందాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర కమీషనర్ కె రమేష్, బిసి వెల్ఫేర్ డిడి సిహెచ్ హరిప్రసాద్, కాకినాడ అర్బన్ తాహసిల్దార్ వైఎస్ హెచ్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...