విజయవాడ, పెన్ పవర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ పేదలకు ప్రకటించిన 1000/-రూపాయల సాయాన్ని 5,000 రూపాయలుగా పెంచాలి.. దాసరిరంగనాథ్ మాల యువత కన్వీనర్ , కృష్ణాజిల్లా .
విజయవాడ : స్థానిక విలేకరుల సమావేశంలో దళిత అభ్యుదయ సేవా సమితి కన్వీనర్ శీలం రాజు , మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్ , పెనమలూరు నియోజకవర్గ ఎంఎం ఎన్ అధ్యక్షులు గోగులమూడి రాజు మాట్లాడుతూ....
ప్రపంచ వ్యాప్తంగా , అత్యంత ప్రమాదకరంగా మారిన "కొవిడ్-19 , కరొనా వైరస్" యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి అని , కరోన వైరస్ నుంచి తమను తాము రక్షించుకొవల్సిన అవసరం ఎంతైనా ఉందని , ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు .
అలాగే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేయుచున్న ప్రతి మంచి పనిని రాజకీయాలకు , పార్టీలకు , మతాలకు , వర్గాలకు, అతితంగా పటించాల్సిన అవసరం ఉందన్నారు . పేదలకు చేయుచున్న ప్రతి పనిని స్వాగతిస్తామనీ కొనియాడారు .
కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సయం చేయాలని కోరుతూ , కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఉచితము గా అందజేయనున్న రేషన్ ను ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం అలాగే నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని...
రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలకు మీరు ఏప్రిల్ 4వ తారీఖున వాలంటీర్ల ద్వారా అందిస్తానన్న 1000/-రూపాయలను 5000/- రూపాయలుగా పెంచి అందించాలని శీలం రాజు , దాసరి రంగనాథ్ , గోగులమూడి రాజు ప్రభుత్వాన్ని కోరారు
No comments:
Post a Comment