కోడి పందెం రాయుళ్ళు అరెస్ట్.
పెన్ పవర్ తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం పట్టణంలోని వీకర్స్ కాలనీ గాయత్రీ గుడి సమీపంలో కోడి పందాలు ఆడుతున్న వారిపై లాఠీ ఝుళిపించిన పట్టణ పోలీసులు, ఒక పక్క కరోనాతో ప్రజలు విలవిల్లాడుతుంటే ఇదేమీ పట్ట నట్లు సందిట్లో సడేమియాగా గుంపులు, గుంపులుగా గా కోడిపందాలు ఆడుతున్న కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీకర్స్ కాలనీ గాయత్రీ గుడి సమీపంలో కోడి పందాలు ఆడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కోడిపందేలు ఆడుతున్నవారిపై తమదైన శైలిలో ట్రీట్ మెంట్ చేశారు. ఒక పక్క కరోనా ప్రమాదంపై సహనంతో ప్రజలందరికీ నచ్చజెపుతున్న ఖాకీలకు పందెం రాయుళ్ళ ఆగడాలతో చిర్రెత్తుకొచ్చింది, సహనం వీడి లాఠీలకు పనిచెప్పి గుంపును చెదరగొట్టి అరెస్టు చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ రైడ్ లో పట్టణ సిఐ ఆకుల రఘు, ఏ ఎస్ ఐ. వెంకన్నబాబు. తదితర పోలీస్ లు పొల్గొన్నారు.
No comments:
Post a Comment