నర్సిపట్నం, పెన్ పవర్ : సర్సీపట్నం నూకాలమ్మ పండగ సందర్భంగా గరగలను ఊరేగింపు ప్రారంభించారు. ముందుగా రెల్లి కాలనీలో ప్రారంభమైన ఈ ఊరేగింపు ఎస్సీ కాలనీ మీదుగా పాత సంతబయలు, కృష్ణాబజారు, అబీద్ సెంటర్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ దనిమిరెడ్డి నాగు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ అమ్మవారి జాతర మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారిని దర్శించి దర్శనం చేయడం జరుగుతుందన్నారు. కొత్త అమావాస్య పండగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తారని వారందరికీ దర్శనం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment