నిభందనలు అతిక్రమిస్తే కఠిన చర్యలే
ఆత్రేయపురం మండల అధికారుల హెచ్చరిక
ఆత్రేయపురం, పెన్ పవర్
ఆత్రేయపురం మండలం లోని నార్కెడ్ మిల్లి, అంకంపాలెం, ర్యాలి గ్రామాల్లో ఆత్రేయపురం మండల తాహశిల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ నాతి బుజ్జి, ఎస్సై నరేష్ సంయుక్తంగా పర్యటించి గ్రామాల్లో పలు ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేసి నిభందనలు అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టారు.విదేశాల నుండి ఆత్రేయపురం మండలానికి ఇప్పటి వరకు 86 మంది రాగా , వారిలో 80 మంది ఇప్పటికే 14 రోజుల హోం క్వారన్టైన్ పూర్తి చేసారనీ అయినప్పటికీ వారంతా మరో వారంరోజుల పాటు వారి గృహాల్లోనే ఉండాలని తెలియజేసి వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామన్నారు.గత ఐదు రోజులలో చాలా మంది ఉద్యోగం, వ్యాపారం మరియు చదువు నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులు, వ్యాపారస్తులు ఎలాంటి సమాచారం లేకుండా తిరిగి వారి గ్రామాలకు వచ్చేసారనీ, గ్రామ వాలంటీర్ల ద్వారా అలాంటి వారి వివరాలు సేకరించి వారికి కూడా గృహనిర్భంధ నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విధంగా వచ్చిన వారు నార్కెడ్ మిల్లి గ్రామంలో అధికంగా ఉన్నారనీ, పైగా నోటీసులను పట్టించుకోకుండా కొందరు బయటకు రావడంతో నార్కెడ్ మిల్లి లో ఆకస్మికంగా పర్యటించిన అధికార బృందం వారికి పనిష్మెంట్లు ఇచ్చి , నిభందనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని కూడళ్ళలో మైక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామ వాలంటీర్లకు, సచివాలయ సిబ్బంది కి ప్రభుత్వ నిభందనల అమలులో సహకరించకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలంతా క్రమశిక్షణ తో ఉండాలని, ఎక్కడా గుమిగూడ వద్దనీ, సామాజిక దూరం పాటించాలని అన్నారు. ఈ తనిఖీలలో ఆర్ఐ రామారావు, కార్యదర్శులు శ్రీనివాస రావు, కృష్ణ, కానిస్టేబుల్స్, గ్రామ సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు పాల్గొన్నారు
No comments:
Post a Comment