Followers

సమర్థులను అధిష్టానం గుర్తించాలి


గాజువాక, పెన్ పవర్: సమర్ధులకు పార్టీ టికెట్లు కేటాయిస్తే ఊహించని విజయాన్ని అందించవచ్చని వైఎస్సార్ సీపీ 66 వ వార్డు అధ్యక్షుడు షౌకత్ అలీ అన్నారు.గాజువాక కణితి రోడ్డులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా ఆ తర్వాత వార్డు అధ్యక్షుడిగా సేవలు అందిస్తూ వస్తున్నానని చెప్పారు. ఇటీవల వార్డు కార్పొరేటర్ల టికెట్ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశించానని కానీ చివరికి అన్యాయం జరిగిందన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వార్డులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. పార్టీ టికెట్ ఇంకా ఎవరికీ ఇవ్వనందున ఇప్పటికైనా తమ సేవలను గుర్తించి అధిష్టానం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.కరోనా కారణంతో ఎన్నికలు వాయిదా వేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల తేదీ ప్రకటన లోపు  న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. అప్పటికీ న్యాయం జరగక పోతే తనను నమ్ముకొని ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో కొప్పిలి సత్యనారాయణ, పేరం రామకృష్ణ రెడ్డి, ఫజుల్ రెహమాన్, అనీఫ్, ఖతల్ రెహమాన్, సుమతీ, మంగ, లక్ష్మీ, కౌసల్ తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...