చోడవరం పెన్ పవర్
కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు చోడవరం నియోజకవర్గంలో చోడవరం టౌన్ మరియు వడ్డాది, రావికమతం, కొత్తకోట రోలుగుంట మొదలగు ప్రాంతాలలో విశాఖపట్నం జిల్లా ఎస్.పి భాపూజి సోమవారం పర్యవేక్షించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి స్టేషన్ లో ఉన్న స్థానిక ఎస్సై మరియు పరిధి లో ఉన్నటువంటి సీ.ఐ లను కలిసి కరోనా గురించి వారికి మరింత అవగాహన కల్పించడం జరిగింది. 144 సెక్షన్ అమలులో ఉన్నందున రోడ్లపై షాపులు ఏమైనా తెరిచి ఉన్నాయా, జనసంచారం ఏమైనా ఉందా అనే విషయంపై పర్యవేక్షించారు. ఈ సమయంలో పోలీసు వ్యవస్థ చాలా గొప్పగా పని చేస్తుందని ఆయన కొనియాడారు.
No comments:
Post a Comment