Followers

ప్రజలందరూ ఇళ్ల కే పరిమితం


ప్రజలందరూ ఇళ్ల కే పరిమితం





*చప్పట్లతో  వైధ్యులకు అభినందనలు తెలిపిన ప్రజలు

 

రావులపాలెం, పెన్ పవర్ :

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో  మండలంలోని ప్రజలు స్వచ్చందంగా ఇళ్ల కే పరిమిత మయ్యారు. దీంతో రహదారులు ఎక్కడికక్కడ నిర్మానుష్యమయ్యాయి. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండడంతో ప్రధానమైన జాతీయ రహదారిలతో పాటు పుర వీధులు కూడా నిర్మానుష్యంగా మారాయి.కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందనుండటంతో ప్రజలు దీన్ని నివారించడం కోసం ఇళ్ల నుండి బయటకు రాలేదు.రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.పోలీస్ సిబ్బంది ఉదయం నుండి  ప్రధాన వీధుల్లో గస్తీ నిర్వహించారు. రావులపాలెం పోలీసులు సి.ఐ వి.కృష్ణ ఆధ్వర్యంలో వైద్య సేవలందించిన డాక్టర్ల కు, నర్సులకు,108, 104 , సిబ్బందికి, పారిశుధ్య కార్మికుకు అభినందనలు తెలిపారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...