Followers

కరోనా వైరస్ మహమ్మారిని సమిష్టిగా తరిమికొట్టండి.


 


కరోనా వైరస్ మహమ్మారిని సమిష్టిగా తరిమికొట్టండి.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి.

         పెన్ పవర్... వి.మాడుగుల. 
కరోనా వైరస్  మహమ్మారిని  అందరు  సమిష్టిగా  ఎదుర్కోవాలని  రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి  ముత్తం శెట్టి  శ్రీనివాస రావు  అన్నారు. సోమవారం  మాడుగుల  మండల పరిషత్  సమావేశ మందిరంలో  వైద్య ఆరోగ్య శాఖ   ఎంపీడీవో  రెవెన్యూ  పోలీస్  శాఖ ల  అధికారులతో కరోనా పై  సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా వైరస్  నిర్మూలనకు  అధికారులు  వైద్య సిబ్బంది  ప్రజలు  సహకరించాలన్నారు. సామాజిక భద్రత  తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం  తక్కువ మంది కూలీలతో  వ్యక్తిగత దూరం పాటించి  అయితే అమలు జరిగేలా  ఎంపీడీవోలు  కృషిచేయాలని  ఆయన అన్నారు.  ఇతర ప్రాంతాల నుంచి  వచ్చిన వారి  ద్వారా  కరోనా వైరస్  పాజిటివ్ కేసులు  నమోదు అయ్యాయి తప్ప  స్థానికంగా ఉండే వారి ద్వారా కాదని  మంత్రి అన్నారు.  గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీరు పై అధికారులు  శ్రద్ధ చూపాలని  ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో  అవసరమైన కిట్లను  సిబ్బందిని  ఏర్పాటుకు  కృషి చేస్తానని  మంత్రి   హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న  అనకాపల్లి  పార్లమెంట్ మెంబర్ భీ శెట్టి వెంకట సత్యవతి  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం కరోనా పై  చిత్తశుద్ధితో పని చేస్తుందని  అన్నారు. అధికారులు ప్రజలు సహకారంతో  వైరస్‌ ను  దూరం చేయవచ్చని  ఆమె అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు ఐదు లక్షల  మాస్క్ లు  5000 పి పి సి కిట్లు  అవసరమని  వాటిని త్వరలో సరఫరా చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ విప్పుబూడి  ముత్యాల నాయుడు మాట్లాడుతూ  నియోజకవర్గంలో కరోనా పై  అధికారులు  అప్రమత్తంగా ఉన్నారని  ఎప్పటికప్పుడు   వివరాలు  ఇస్తూ  ప్రజలకు  అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు వలస కూలీల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని  వైద్య అధికారులకు  సూచించారు . ఈ కార్యక్రమంలో అనకాపల్లి డి ఎస్ పి  శ్రావణి   నర్సీపట్నం డి ఎల్ పి ఓ  శిరీష రాణి  ఎంపీడీవో పోలినాయుడు  తహసిల్దార్  రామ్ శేషు  వైద్యాధికారులు  పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...