Followers

వంశీ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి


 


వైసీపీ అభ్యర్థి వంశీ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి!


మాజి ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి చింతలపూడి వెంకట్రామయ్య



గాజువాక, పెన్ పవర్  : గ్రేటర్ ఎన్నికల్లో జివిఎంసి 74 వ వార్డు నుండి వైసీపీ పార్టీ నుండి కార్పెరేటర్ గా పోటిచేస్తున్న యువ నాయకులు , స్నేహశీలి ఐనటువంటి తిప్పల వంశిరెడ్డిని ఏకగ్రీవంగా గెలిపింసిచుకోవలసిన బాధ్యత మన వార్డు ప్రజలందరూ పైన ఉందని మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి అన్నారు. బుధవారం వార్డు పరిధి సిద్దేశ్వరం  గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిధిలుగా పెందుర్తి, గాజువాక మాజీ ఎమ్మెల్యే లు తిప్పల గురుమూర్తి రెడ్డి , చింతలపూడి వెంకటరామయ్యా, వైసీపీ అభ్యర్థి తిప్పల వంశిరెడ్డిలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ త్వరలో  జరిగే గ్రేటర్ ఎన్నికలలో గాజువాక నియోజక వర్గంలో ఉన్న 20 వార్డులలో కూడా వైసీపీ విజయకేతనం ఎగరువేస్తుందని జోష్యం చెప్పేరు. నియోజకవర్గంలో ఉన్న  20 వార్డులలో ముఖ్యంగా 74 వ వార్డు కార్పరేటర్ అభ్యర్థి తిప్పల వంశిరెడ్డిని వార్డు ప్రజలంతా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారనే నమ్మకం తనకి వుందన్నారు. చింతలపూడి వెంకట్రామయ్య మాట్లాడుతూ సిద్దేశ్వరం  గ్రామ ప్రజలందరూ ఏకమై  వంశిరెడ్డి గెలుపుకు పాటుపడడం ఆనందంగా ఉందని అన్నారు. ఒక్క సిద్దేశ్వరం  గ్రామమే కాకుండా అన్ని గ్రామాల్లో వార్డు ప్రజలు మొత్తం ఒకటై వంశిరెడ్డిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్పరేటర్ అభ్యర్థి వంశిరెడ్డి మాట్లాడుతూ తన గెలుపుకోసం తన సోదరులు మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి ,  చింతలపూడి వెంకటరామయ్యలు తనని ఆశీర్వదించి తన గెలుపుకోసం ప్రచారాలలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ , పూర్తి స్థాయిలో సహాయసహకరలందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా మొదటి నుండి సిద్దేశ్వరం  గ్రామ ప్రజలు , యువత మా కుటుంబానికి వెన్నంటే ఉండడం తన అదృష్టమన్నారు. తనని కార్పరేటర్ గా గెలిపిస్తే వార్డులో ఉన్న అన్ని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సిద్దేశ్వరం గ్రామ  ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  గ్రామ పెద్దలు పూతి తాతారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సత్తిరెడ్డి,తాతారావు, పిట్టా అప్పారావు, గొరుసు సత్యం,పెంటయ్య రెడ్డి, అప్పారావు, సత్యరావు,పిట్టా రెడ్డి, రాజు , ప్రసాద్ రెడ్డి , గురునాధ్  ,గ్రామ ప్రజలు , మహిళలు , పేద సంఖ్యలో యువత పాల్గొన్నారు.






No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...