ఆరిలోవ, పెన్ పవర్ :తూర్పు నియోజకవర్గం 12వ వార్డు వైఎస్ఆర్సిపి అభ్యర్థిని అక్కరమాని కుటుంబం చుట్టూ తిరుగుతూనే ఉంది, మొదటినుండి వైసిపి అభ్యర్థులు ఎంపిక అనేక మార్పులు చేసుకున్నాయి. స్థానికులు కాదని పార్టీ ఆవిర్భావం నుంచి జెండాను, పార్టీ పథకాలను, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిన అభ్యర్థులను కాదని పార్టీ టికెట్లు స్థానికేతరులకు ఇవ్వడం పట్ల వైఎస్ఆర్సిపిలో అసంతృప్తి నెలకొంది, వార్డుల విభజన ఒకవైపు, కొత్త ముఖాలు మరోవైపు, కొత్తపరిచయాలు కొత్త వార్డు అధ్యక్ష నాయకులు కార్యకర్తలు ఎవరెవరు ఏమిటో ఇంకా తెలియని కొత్తదనం ఇలాంటి పరిస్థితుల్లో రెబల్ గా ఉన్న అభ్యర్థులు పార్టీ విజయానికి ఎంతవరకు కృషి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇదిలా ఉండగా టిడిపి తన ప్రచారంలో దూకుడు పెంచింది ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు ఇరువురు మధ్య పోటీ నెలకొని ఉంది ఆరు వారాల కాలవ్యవధిలో ఎలాంటి మార్పులు " ఓటు" చేసుకుంటాయో చూడాలి.
No comments:
Post a Comment