మోతుగూడెం, పెన్ పవర్:
వైరస్ అనగానే మనం మాస్కుల కోసం మెడికల్ షాప్ కు పరుగులు పెడతాం. కానీ ప్రకృతి ఒడిలో జీవనం సాగించే అడవి బిడ్డలకు అవేవీ అందుబాటులో ఉండవు. మరి కరోనా వంటి వైరస్ల బారిన పడకుండా ఉండాలనే ఆ అడవి బిడ్డల పరిస్థితేందని ఆలోచిస్తే.. శతకోటి వైరస్లకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు.. ఆ ప్రకృతి వారికి దిక్కయింది. సహజసిద్ధమైన మాస్కులకు మార్గం చూపింది,ఏజెన్సీ ప్రాంతంలో మన అంధ్ర ప్రాంతంతోపాటు సరిహద్దులోని ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అడవి బిడ్డలు మాస్కులు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. ఆకులు సేకరించి ఫేస్ మాస్కులుగా తయారుచేసి ధరించారు,నేలకోట, వెములరాయి మరియు ఒరిస్సా రాష్ట్రంలోని అదర్ పోల్లురు అటవీ ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి,పట్టణ ప్రాంతాల్లో కొందరు మాస్కులు లభించడం లేదని నిర్లక్ష్యంగా తిరుగుతుంటే.. ఈ అడవి బిడ్డలు మనసుతో ఆలోచించి మార్గాన్ని వెతుక్కున్నారు.
No comments:
Post a Comment