- అధికారులకు పట్టదు.. పాలకులు పట్టించుకోరు...
10 లక్షల రూపాయలు ప్రజాధనం నిరుపయోగం
స్వచ్ఛ భారత్‌కు పాడేరులో తూట్లు.. మరుగు కోసం మహిళ ఇక్కట్లు
పట్టుమని 10 రోజులు కూడా వినియోగంలో లేని సులాబ్‌కాంప్లెక్సు
పాడేరు, (పెన్‌పవర్): నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే పాడేరులో సులాబ్‌కాంప్లెక్సు లేక మహిళలు మరుగుకోసం తీవ్ర ఇక్కట్లుకు గురవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్భాటంగా ప్రచారం చేసే స్వచ్ఛ భారత్‌ప్రకటనకే పరిమితం తప్ప ఆచరణలో ఘోరంగా విఫలం అయ్యిందని చెప్పడానికి నిదర్శనంగా పాడేరు డివిజన్‌కేంద్రాన్ని చూపవచ్చు. విశాఖ జిల్లా కేంద్రం తరువాత జిల్లాలో అత్యంత ప్రాధాన్యం ఉన్న కేంద్రంగా పాడేరును చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇద్దరు ఐఏఎస్‌అధికారులు, ఒక ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌అధికారి పాడేరులో స్థానికంగా ఉండి పాలన సాగిస్తుంటారు. వీరితో పాటుగా పలు శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాడేరు కేంద్రంగా విధులు నిర్వహిస్తుంటారు. ఈనేపథ్యంలో నిత్యం విశాఖ మన్యంలోని 11 మండలాల నుండే గాకుండా మైదాన ప్రాంతం నుండి ఐటిడిఎ, సబ్‌కలెక్టర్‌కార్యాలయాలకు వేలాదిమంది వస్తూ పోతూ రాకపోకలు సాగిస్తుంటారు. పాడేరులో వర్తక వాణిజ్య సముదాయాలు పెరగడం, పలు ప్రభుత్వ శాఖ కార్యాలయాలు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికి తోడు పర్యాటక ప్రాంతం కావడంతో అటు లంబాసింగి, ఇటు అరుకు, కొత్తపల్లి జపాతాలు తిలకించేందుకు వచ్చే పర్యాటకుల తాకిడి ఇటీవల మరింతగా పెరిగింది. పాడేరులో స్థానికంగా ఉండే ప్రజలకే మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. నిత్యం వేలాదిగా ప్రజలు పాడేరు రాకపోకలు సాగించే వారికి మరుగు సమస్య వెంటాడుతుంది, వీరి మరుగు సమస్య చెప్పాలంటే వర్ణనాతీతం. పాడేరు మొత్తంగా ఒక్క ఆర్టీసీ బస్టాండ్‌ఆవరణలోనే మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ ప్రయాణీకులకే చాలీచాలని మరగుదొడ్ల వద్ద పట్టణ ప్రజలతో పెద్ద క్యూలైను దర్శనం ఇస్తుందంటే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. హోటళ్లులో అయినా కనీసం మహిళల కోసం బాత్‌రూము ఉన్నాయా అంటే అవీ కూడా అందుబాటులో లేవు, దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపద్యంలో పాడేరు ఆర్‌డబ్ల్యూఎస్‌అధికారి 10 లక్షాల రూపాయలు వెచ్చించి పాడేరు కాఫీ హౌస్‌ఎదుట, ఐటిడిఎ ప్రక్కన, కో-ఆపరేటివ్‌బ్యాంక్‌సమీపంలో సులాబ్‌కాంప్లెక్సు నిర్మించారు. మూడు సులాబ్‌కాంప్లెక్సులకు రన్నింగ్‌వాటర్‌సదుపాయం కూడా ఏర్పాటు చేసారు. ఒక్కో సులాబ్‌కాంప్లెక్సులో నాలుగు మరుగుదొడ్లు (రెండు పురుషులకు, రెండు మహిళలకు) నిర్మించారు. నిధులు దుర్వినియోగంలో పేరెన్నికగన్న అధికారులు 10 లక్షాల ప్రజాధనం వెచ్చించి నిర్మాణం జరిపి తమ బాధ్యత తీరిపోయినట్లు చేతులు దులుపుకొన్నారు. 3 సులాబ్‌కాంప్లెక్సులు ప్రజావసరాలకు అనుగుణంగా అందుబాటులోనికి తీసుకునివచ్చి మౌళిక సదుపాయం కల్పించాల్సిన మేజర్‌పంచాయితీ పాలకులు , అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరించడంతో పట్టుమని పది రోజులు కూడా సులాబ్‌కాంప్లెక్సులు అందుబాటులో లేకుండా పోయాయి. కేవలం మూడు రోజులు సంబరానికి 10 లక్షాల రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగం చేయడంపై స్తానికంగా సర్వత్రా విమర్శలు వెళ్ళువెత్తుతున్నయి. ఇదిలా ఉండగా పంచాయతీ అధికారి సులాబ్‌కాంప్లెక్సు నిర్వహణకు పత్రికా ప్రకటన ద్వారా టెండర్లు పిలిచారు. కాగా సులాబ్‌కాంప్లెక్సు టెండర్లో దక్కించకున్నవారు తిరిగి గ్రామ పంచాయితీకి డబ్బు చెల్లించాలనే నిబంధన టెండర్లో పెట్టడంతో ఎవరూ ముందుకు రాలేదు. గతంలో మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా కేవలం మూడు రోజులు మాత్రమే 10 లక్షాల రూపాయలు వెచ్చించి నిర్మించిన సులాబ్‌కాంప్లెక్సు వినియోగించారు. తరువాత నిర్వహణ లేకపోవడంతో దుర్గంధం వేదజల్లుతున్నాయి సులాబ్‌కాంప్లెక్సు, అధికారులు నాలుగు సులాబ్‌కాంప్లెక్సుల నిర్మాణం అని చెప్పి మూడు నిర్మించి చేతులు దులుపుకొన్నారు. నిర్మించిన 3 సులాబ్‌కాంప్లెక్సులు రన్నింగ్‌వాటర్‌ఉండీ ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదో అధికారులు , పాలకులే చెప్పాలి. అదే సందర్బంలో పాడేరు ఐటిడిఎ ప్రక్కన, పిఎంఆర్‌సికి వెళ్లే రహదారిలో నిర్మించిన సులాబ్‌కాంప్లెక్సు అక్కడ ఉన్న ఛాయలు కనిపించకుండా చూట్టూ దుకాణ సముదాయాు ఏర్పడ్డాయి. సులాబ్‌కాంప్లెక్సు చుట్టూ ఏర్పడ్డ దుకాణ సముదాయాల విషయం రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరిగింది అనేది సుస్పష్టం. ఎన్నికల్లో ఇది చేస్తాం.. అది చేస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాల , హామీలు ఇచ్చే ప్రజా ప్రతినిధులు కనీస మౌళిక సదుపాయా కల్పనలో ఘోరాతిహోరంగా విఫలం అయ్యారని చెప్పడానికి ఎక్కడో మారుమూల గ్రామాలు కాకుండా పాడేరు డివిజన్‌కేంద్రం నిదర్శనంగా నివడం పాలకులు, అధికారుల స్వచ్చభారత్‌లక్ష్యానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
No comments:
Post a Comment