మద్యం దొరక్క వృద్ధుడు ఆత్మహత్య
మండపేట, పెన్ పవర్
మద్యం దొరక్క వ్యసనానికి బానిస అయిన తోపుడు బండి రిక్షా కార్మికుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. టౌన్ ఎస్ ఐ తోట సునీత కధనం మేరకు మండపేట గాంధీ నగర్ రైతు బజార్ ఎదుగా ఉన్న వీధి లో నివసిస్తున్న షేక్ బాజి ఖాన్ (శ్రీను) (56) మండపేట రవికాంత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పాత సామిల్లు షెడ్డు కు ఉరి వేసుకొని మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున రోడ్ పై వెళుతున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా బాజి స్వస్థలం రాజమహేంద్రవరం. అక్కడ ఆర్ టి సి కాంప్లెక్స్ బయట ఇతని తండ్రి సత్తార్ సాహెబ్ పచ్చి చేపలు విక్రయించే వారు.బాగా బతికిన కుటుంబం. కాలక్రమంలో ఆర్ధికంగా చితికి పోయారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా 20 ఏళ్ళ క్రితం వారిని విడిచి పెట్టి మండపేట వచ్చేశాడు. ఇక్కడ జీవిన ఉపాధి కోసం తోపుడు రిక్షా నడుపుతూ బ్రతుకు తున్నాడు.ఈ క్రమంలో రైతు బజార్ సమీపంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలు తో సహజీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస గా మారాడు. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్ కావడంతో ఈ మూడురోజులు గా మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆత్మహత్య కు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆటో యూనియన్ నాయకులు మధు తదితరులు అక్కడికి చేరుకుని గుర్తింపు కార్డు ఆధారం గా కొవ్వూరు లో నివసిస్తున్న భార్య, పిల్లలకు సమాచారం ఇచ్చారు.కాగా 20 ఏళ్ళ క్రితమే వదిలేసమని సమాధానం ఇచ్చినట్లు వారు తెలిపారు. దీనిపై ఎస్ ఐ సునీత అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment