Followers

ప్రజలు సహకరించాలి


 


మండపేట, పెన్ పవర్


ప్రజల సౌకర్యార్థం ఉదయం 6 నుండి 10గంటల వరకూ ఉన్న నిత్యవసరాల కొనుగోలు సమయాన్ని ఉదయం 6 గంటలు నుండి మద్యాహ్నం 1 గంట వరకూ మార్పు చేయడం జరిగిందని, అయితే పురపాలక శాఖ ప్రవేశపెట్టిన వంతుల వారి విధానినికి సహకరించకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవని మండపేట మున్సిపల్ కమీషనర్ త్రివర్ణ రామ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు కొత్త విధానాన్ని ఆయన మీడియాకు వివరించారు.


మండపేటలో సుమారు 18 వేల కుటుంబాలు ఉండగా 6వేల కుటుంబాలకు ఒక రంగు చొప్పున కార్డులు ప్రచురించడం జరిగిందన్నారు. వీటిని వార్డు వాలంటీర్లు ద్వారా ఆఘమేఘాలపై ఇంటింటికీ అందివ్వడం జరుగుతుందన్నారు. కుటుంబంలో ఎవరు బయటకు వస్తారో చెబితే వారి పేరున కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్డు రాయించుకున్న వారు ఆధార్ కార్డు ను తమ వెంట పెట్టుకుని నిత్యావసరాల కొనుగోలుకు బయటకు రావాల్సి ఉంటుందన్నారు. ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుండి 8 గంటలు వరకూ 6 వేల కుటుంబాలకు, 8 గంటలు నుండి 10 గంటలు వరకూ మరో ఆరు వేల కుటుంబాలకు, ఆ తరువాత 10 గంటల నుండి 12 గంటలకు మిగిలిన 6 వేల కుటుంబాలకు బయటకు వచ్చే అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. ఏ రెండు గంటల వ్యవధిలో ఎవరు బయటకు రావాలో కార్డుపై వివరంగా ముద్రించడం జరిగిందన్నారు కార్డులో పేర్కొన్న సమయంలో మాత్రమే సదరు కార్డు దారులు బయటకు రావాలని, లేని పక్షంలో పోలీసులు అనుమతులు ఇవ్వరని స్పష్టం చేసారు. కొనుగోలు కార్డు లేకుండా ఒక్కరూ కూడా బయటకు రాకూడదని, అనవసరంగా వచ్చి పోలీసుల చేతిలో ఇబ్బందుల పాలు కావద్దని కమీషనర్ కోరారు. కాగా ఈ విధానంతో చుట్టు పక్కల ప్రాంతల వారు మండపేటకు వచ్చేందుకు అవకాశం లేదని చెప్పవచ్చు. పట్టణంలోని 30 వార్డుల వారికి మాత్రమే కార్డులు రానుండటంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు దాదాపు పట్టణ దారులు మూసుకుపోయాయని చెప్పవచ్చు. అయితే పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఈ వంతుల వారి విధానం ద్వారా గణనీయంగా ప్రజా రద్దీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...