స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్) జిల్లా లో జనతా కర్ఫ్యూని ప్రజలు విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో కర్ఫ్యూ సక్సెస్ అయింది. కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ రైల్వే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించాలని ప్రభుత్వం ఆదివారం జనతా కర్ఫ్యూ ని విధించారు. ప్రజలు స్వతహాగా పాటించడంతో ఆయా ప్రాంతాల్లో నిర్మానుష్యంగా మారాయి. పట్టణ ప్రాంతాల కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూ తూచా అమలు జరిగిందని చెప్పవచ్చు. పర్యాటక ప్రాంతమైన అరకు జన సంచారం లేకుండా వెలవెలబోయింది. వాహనాలు పర్యాటకుల తాకిడి కనిపించలేదు దుకాణాలు హోటల్ లో మూతపడ్డాయి అలాగే పాడేరు పెదబయలు ముంచంగిపుట్టు చింతపల్లి జి.మాడుగుల మండలాలు స్మశానాలలోను తలపించాయి. గిరిజనులు కరోనా వై సెక్స్రస్ పై అవగాహనతో కర్ఫ్యూను పాటించారు పనులు విడిచి ఎల్ల కే పరిమితమయ్యారు. వారపు సంత లకు సైతం వెళ్లకపోవడంతో సంతలు బోసిపోయాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గించాలని చేపట్టిన జనతా కర్ఫ్యూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా విజయవంతమైందని చెప్పొచ్చు. మాడుగుల చోడవరం నియోజకవర్గాల పరిధిలో జనతా కర్ఫ్యూ పాటించారు ఉదయం నుంచి షాపులు హోటల్ లు మూసివేశారు. జనసంచారం లేకపోవడంతో కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. తహసీల్దార్లు పోలీసులు మైకులు ద్వారా ప్రసారం చేయడంతో ప్రజలు కర్ఫ్యూ కు మద్దతు ఇచ్చారు.
.
Followers
జిల్లాలో జనతా కర్ఫ్యూ సక్సెస్. ఇళ్ల కే పరిమితమైన జనం.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
No comments:
Post a Comment