Followers

మానవత్వం చాటిన కళింగాంధ్ర యూత్ అసోసియేషన్

 


 

తలసేమియా భాదిత బాలుడికి 1,20,000(లక్షా ఇరవై వేలు) రూపాయల ఆర్థిక సాయం అందజేత

 

ఆమదాలవలస, పెన్ పవర్ :తలసేమియా వ్యాధితో బాధపడుతున్న తొమ్మిదేళ్ల చిన్నారికి కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఎన్ఆర్ఐ విభాగం అండగా నిలిచింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం లక్షా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేసి తన పెద్ద మనసును చాటుకుంది.ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అయినా దామోదర మల్లేశ్వరరావు చిన్న కుమారుడు దామోదర హర్షవర్ధన్ (9 సంవత్సరాలు)  తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ తన వంతు సహకారం అందించేందుకు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కళింగాంధ్ర సింగపూర్ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధి పేడాడ అమర్ దీప్ తన సహచర ఉద్యోగులు ,స్నేహితులతో కలిసి ఆ బాలుడి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ 1,20,000 రూపాయలను సేకరించారు. ఈ మొత్తాన్ని శ్రీకాకుళం లో గల కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ప్రతినిధులు" చేయూత అందించు నేస్తమా" కార్యక్రమంలో భాగంగా ఆ మెుత్తాన్ని చెక్కు రూపంలో బాలుడి తండ్రి మల్లేశ్వరరావుకు మంగళవారం ఉదయం అందజేశారు. ఈ సందర్భంగా కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కులం, మతం , భాష,  ప్రాంతం ఏదైనా ....సేవ చేసేందు కళింగాంధ్ర యువత ఎప్పుడూ ముందుంటుందన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న హర్షవర్ధన్ కు తమ వంతు సహకారం అందించేందుకు తమ కళింగాంధ్ర యువత ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన పేడాడ అమర్ దీప్ చేపట్టిన ఈ ఆర్థిక సహాయ కార్యక్రమం యువతులో మరింత స్ఫూర్తిని నింపిందన్నారు. గత పది నెలలుగా కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ సేవే పరమావధిగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతూ, మరోవైపు ప్రజలలో పలు అంశాలల్లో సామాజిక స్పృహను కలిగిస్తూ చైతన్యవంతులను చేసేందుకు ప్రయత్నం చేసిందిని చెప్పారు. కడుపేదరికంతో ఉంటూ, అనారోగ్య సమస్యలతో బాధపడే కుటుంబాలకు కళింగాంధ్ర యువత భరోసాగా నిలుస్తుందన్నారు. ఇటువంటి వారికి సేవ చేయడంలో లభించే సంతృప్తి మరెక్కడా లభించదని పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ,కన్నీటి సంద్రంలో ఉన్న ఇటువంటి వారిని ఆప్యాయంగా ప్రేమతో అక్కున చేర్చుకున్న రోజున వారిలో కలిగే ఆనందం ఎనలేనిది అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉంటూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూసే వారి కోసం కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ *చేయూత అందించు నేస్తమా* అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారికి వైద్య సేవలు అందించడంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకున్నేందుకు దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. హర్షవర్ధన్ తండ్రి మల్లేశ్వరరావు మాట్లాడుతూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తనకు కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఊరట కలిగించిందన్నారు. తన కుమారుడు పట్ల అమితమైన ప్రేమను చూపిన కళింగాంధ్ర యువతకు తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పైడి నవీన్ కుమార్ , సనపల రామకృష్ణ, కొత్తకోట శ్రీహరి మాస్టర్ , సిగుళపల్లి వెంకట సత్యనారాయణ , బొడ్డేపల్లి నేతాజి ,పూజారి శ్రీధర్ ,

బొడ్డేపల్లి భాస్కరరావు, జల్లు లోకేష్, పవన్ ,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...