బోగస్ కార్డులు ద్వారా రేషన్ మాయం చేస్తున్నారంటూ స్ఠానికుల ఫిర్యాదు.
జేసి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్న సిఎస్ డిటి మరియు డిఎస్ ఓ.
రికవరీ చేయాలని అదికారులను కోరిన ఫిర్యాదు దారులు.
పాయకరావుపేట.పెన్ పవర్
స్థానిక దుర్గాకాలనీ రేషన్ డిపో39లో అవినీతి జరుగుతుంది.నిర్వాహకులు కాంచన స్దానికంగా లేకపోవడంతో మల్లపురెడ్డి రమాకుమారి బినామి గా చలామని అవుతున్న ఈమె 150 భోగస్ కార్డులను సృష్టించి ప్రజాపంపిణీ నిబందనలను కాలరాసి రేషన్ సరుకులను గత కొన్నేళ్ళుగా పక్కదోవ పట్టిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.. రేషన్ డిపోలో జరుగు తున్న అవినీతి బాగోతంను బట్టబయలు చేసి డిపోని సీజ్ చేసి రికవరీ చేయాలని కోరుతూ స్థానికులు ఎమ్మార్వో కి ఇచ్చిన ఫిర్యాదుపై మూడు రోజులుగా సిఎస్ డిటి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో విచారణను చేస్తున్న సంగతి తెలిసిందే.ఫిర్యాదుపై విచారణను వేగవంతం చేసి పూర్తి వివరాలను తెలియజేయాలని జేసి ఆదేశానుసారం డిఎస్ ఓ.శివప్రసాద్ శుక్రవారం డిపోను పరిశీలించి సిఎస్ డిటి నుంచి వివరాలను తీసుకున్నారు.ఈసందర్బంగా ఫిర్యాదు దారులు డిఎస్ ఓను కలిసి జరుగూతున్న రేషన్ మాఫియాను వివరించారు.జరుగుతున్న అవినీతిపై డిపో డీలర్ గొల్లపల్లి కాంచనకు ఎటువంటి సంబందంలేదు.ఈమెకు పెళై పదిహేన్లు అవుతుంది ఆదార్ కార్డు,బ్యాంకు అకౌంట్ల అడ్రస్ తో ఎస్ .రాయవరం మండలం లింగరాజుపాలెంలో వుంటుంది.ఈమె పేరుతో ప్రస్తుతం డిపో నిర్వస్తున్న వారు బారీ అవినీతి కుంభకోణంనకు కారకులని విచిరణాదికారులకు ఫిర్యాదు దారులు తెలియజేసారు.ఈ సందర్బంగా ఎమ్మార్వో కార్యాలయం నందు డిఎస్ ఓ శివప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ జేసి ఆదేశాలమేరకూ విచారణను క్షేత్రస్థాయిలో పరిశీలించుటకు వచ్చానన్నారు.దుర్గాకాలనీ డిపో నెం.39లో అవినీతి జరిగింది వాస్తవమేనని ఈమద్యనే గ్రామ వాలంటరీలు బోగస్ పేర్లను తొలగించడం జరిగిందన్నారు.ఇప్పటివరకూ ఆన్ లైన్ ద్వారా 37బోగస్ కార్డులను గుర్తించడం జరిగిందన్నారు.డిపో డీలర్ ఎప్పటినుంచి వుంటుంది అని విచారణ చేయాలన్నారు.రేషన్ కార్డులనుంచి భర్తని బార్యను పిల్లలను వేరు చేసి ఆధార్లను సీడ్ చేసి మీసేవా ద్వారా బినామి కార్డులను తయారుచేసి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. బినామి గా వున్న వారు ఇంతవరకూ ఎంత అవినీతి చేసారో డేటా ఆదారంగా పరిశీలించి ప్రజాపంపిణీ వ్యవస్థ నిబంనల చట్ట ప్రకారం చర్యలుంటాయని అన్నారు.అదేవిదంగా ఫిర్యాదు దారుల తెలియజేసిన వివరణలను పరిగణలోనికి తీసుకొంటామన్నారు. తదుపరి ఆదేశాల నిమిత్తం విచారణ డేటాను జేసికి అందజేస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో ఫిర్యాదు దారులు ఇంజరపు సూరిబాబు,పెంకే శ్రీను,ఐఎన్ మూర్తి,కువ్వల కుమార్ ,కర్రి శ్రీను,బద్దా సూరిబాబు,గారా రమేష్ ,పండాడ విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment