Followers

నిర్మానుష్యం అయిన మహానగరం.


 


 


 


 


నిర్మానుష్యం అయిన మహానగరం.


కర్ప్యూతో బోసిపోయిన రహదార్లు,


....బ్యూరో రిపోర్ట్  విశాఖపట్నం (పెన్ పవర్) తెల్లవారింది మొదలు అర్ధరాత్రి వరకు వాహనాలు జనసంచారంతో నిత్యం రద్దీగా ఉండే మహా (విశాఖ)నగరం జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం నిర్మానుష్యంగా మారింది. ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో రోడ్డపై జనసంచారం కనిపించలేదు. దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరసన్ను అంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 7 గంటలు నుంచి రాత్రి 9గంటలు వరకు ప్రజ లు జనతా కర్ప్యూలో పాల్గోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం లేకుంటే వైరస్ నసిస్తుందని. దీని కి ప్రజలు స్వచ్చందగా సహకరించాలని విగ్నప్తి చేసారు. కరోనా వైరస్ ప్రబావంతో హడలి పోతున్న జనం మోదీ సూచనలు తూచా పాటించక తప్పలేదు.ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలు కళాశాలలు మూసివేసిన విషయం తెలి సిందే. రైళ్లు బస్సులు విమాన సర్వీసులు రద్దుచేశారు. కరోనా వైరస్ పై రెడ్ హెలార్ట్ ప్రకటించారు. దీంతో స్వచ్చ ందంగా దుకాణాలు మాల్స్ దియేటర్లు ట్రాన్స్ పోర్టు అంతా నిలిచి పోయింది. అత్యంత రద్దీ ప్రాంతాలైన జగదం బా ఎస్ఏడి మద్దిలపాలెం పలు జంక్షన్లు పిట్టకాకి లేకపోవడం హశ్చర్యం కలిగిస్తుంది. ఇంతటి నిర్మాష్యం నగర చరిత్రలో ఉండే అవకాశం లేదు. ద్వారకా బస్ కాంప్లెక్సు రైల్వే ప్టేషను నిశ్శబ్దంగా మారిపోయాయి. ప్రయాణికులు ప్రజలు ఇళ్లు దాటక పోవడంతో వాహనాల సందడి కూడా కనిపించలేదు. అందుకు తోడు సెలవు రోజు కావడం ప్రభుత్వ అధికార్లు ఉద్యోగులకు విధులు లేవు. పోలీసులు మీడియా సిబ్బంది మాత్రం తమ విధులు నిర్వర్తించ క తప్పలేదు. కర్ఫ్యూ సందర్మంగా ప్రజలు అవసర మైన నిత్యావసర వస్తువులు మందుగా సమ కూర్చు కున్నారు. కానీ ఆదివారం అందరికి ప్రీతైన చికిన్ మటన్ దొరకని పరిస్థితి నెలకొంది. మందురోజు శనివారం కావ డంతో మటన్ చికిన్ షాపులు తెరుచుకోవు. కానీ జనతా కర్ఫ్యూ తెలిసిన వారు అక్కడక్కడ చికిన్ మటన్ షావులు శనివారం సాయింత్ర తెరుచు కున్నాయి. కానీ ఎవరికీ పూర్తిస్థాయిలో అందలేదని తెలుస్తుంది. వీకెండ్ ఎంజోయ్ చేయాలనుకున్న వారికి ఈ సండే నిరాశే మిగిల్చింది. బందులు ధర్నాలు జరిగినా చలించని ప్రజలు ప్రాణాంతక మైన కరోనా వైరస్ బూతానికి తల వంచక తప్పలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డు మీదకు ఏ ఒక్కరు కాలు పెట్టక పోవడం విశేషం. బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం ....


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...