రహస్యంగా పల్లెల్లో పసిబిడ్డల అమ్మకాలు.
బిడ్డల కోసం దళారుల వేట.
అధికార్ల జోక్యంతో వెలుగు చూస్తున్న సంఘటనలు.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్యం (పెన్ పవర్)
దళారుల ప్రోద్బలంతో పల్లెల్లో రహస్యం గా పసిబిడ్డల అమ్మకాలు జరుగుతున్నాయి.ఆర్గీక ఇబ్బందులతో ఉన్నవారిని దళార్లు టార్గెట్ చేస్తున్నారు.డబ్బును ఆశచూపి పిల్లలను అమ్మకాలకు పెడుతున్నారు.ఆర్గీక అసమానతులు పిల్లల భవిష్యత్ దృష్ట్యా కొందరు తల్లిదండ్రులు పసిబిడ్డల అమ్మకా లకు సిద్ధపడుతున్నారు. పది రోజుల వ్యవదిలో మాడుగుల ప్రాంతంలో వెలుగు చూసి న రెండు సంఘటనలే ఇందుకునిదర్శనం.ఇద్దరు ఆశాకార్యకర్తలు మగబిడ్డను చెన్నై కి అమ్మేసిన సంఘటన సిడిపీఓ అనంతలక్ష్మి ఎస్సై రామారావు జోక్యంతో వెలుగు చూసింది. ఈ నెల 12న గొటివాడలో ఆడ బిడ్డను తండ్రి రెండు లక్షలకు అండమాన్ విక్రయిస్తుండగా అధికార్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. జిల్లాలో చాప కింద నీరు లా పసి బిడ్డలను దళారులు అమ్మేస్తున్నట్లు తెలుస్తుంది. పలువురు ఆశాకార్యకర్తలే పసిబిడ్డల అమ్మకాల్లో కీలక పాత్ర పోసిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.మహిళలు నెలతప్పిన నుంచి డెలివరీ అయ్యే వరకు ఆశాకార్యకర్తలదే పాత్ర కావడం వల్ల ఈ వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతుంది. పిల్లల కోసం వెంపర్లాడుతున్న వారినుంచి దళార్లు లక్షల్లో బేరం కుదుర్చుకుని తల్లి దండ్రులకు ఎంతో కొంత ముట్ట జెప్పుతున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహరం టీమ్ నెట్వర్కలో సాగుతున్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి.పసిపిల్లలు కొనుగోలుకు అండమాన్ చెన్నై మహారాష్ట్ర దుబాయ్ నుంచి వస్తున్నట్లు బోగాట్ట.ఈ ప్రాంతంలో ఎనిమిది మంది వరకు ధళార్లు ఉన్నట్లు సమాచారం.జైతవరం చోడవరంకు చెందిన ఇద్దరు దళార్ల కను సన్నల్లో నడుస్తున్న ట్లు తెలుస్తుంది.పిల్లల వ్యవహరం బైటపడితే తల్లి దండ్రుల పైకి నెట్టేస్తున్నారు. తమ పరిస్థితు కారణంగా బిడ్డను పెంపకానికి ఇస్తున్నట్లు ప్లేట్ పిరాయిస్తున్నారు. అధికార్లు వారికి కౌంస్సిలింగ్ ఇచ్చి చైల్డ్ వెల్ఫేర్‌కు అప్పగిస్తున్నారు. ఈ వ్యవహరం పై లోతుగా విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ప్రజాసంఘలు అంటున్నాయి మగబిడ్డని ఆశాలు ఎలా అమ్మేశారు. మాడుగుల కనికర మాత కోలనీకి చెందిన జలుమూరు సుందరమ్మ గర్భవతిగా రెడో అంగన్వాడీ కేంద్రంలో నమోదైంది. ప్రభుత్వం ఇస్తున్న పౌష్టిక ఆహరం అందు కుంటుంది. నెలలు నిండకా ప్రసూతికోసం పుట్టింటికి వెలుతున్నట్లు చెప్పి వెల్లింది. రెండువారాల తరువాత సుందరమ్మ గ్రామానికి వచ్చి అంగన్ వాడీ కేంద్రానికి వెల్లిం ది. బిడ్డను తీసుకు వస్తే బరువులు నమోదు చేసుకుంటానని అంగన్వాడీ కార్యకర్త కోరింది. తల్లి సుందరమ్మ పట్టించుకోలేదు. దీంతో ఆమేను నిల దీయడంతో బిడ్డను పెంచుకోటానికి ఇచ్చాని తెలిపింది. ఈ విషయం మాడుగుల సిడిపీఓ అనంతలక్ష్మికి అంగన్వాడీ కార్యకర్త సమాచారం ఇచ్చింది. వెంటనే ఆమే స్తానిక ఎస్సై రామారావు కు ఫిర్యాదు చేసింది. సందరమ్మను విచారించగా స్థానిక ఆశా కార్యకర్త అన్నపూర్ణ అమ్మేసిందని చెప్పింది. ఆమేను పోలీసులు వారి స్టైల్ లో విచారించగా జరిగిన వివరాలు తెలిపింది. డెలివరీకి పుట్టింటికని చెప్పిన సుందరమ్మ చీడికాడ మండలం జైతవరంకు చెందిన ఆశాకార్యకర్త వెంకట లక్ష్మి వెల్లింది. 15రోజుల తరువాత విశాఖ లో ఒక ప్రైవేటఉ ఆసుపత్రిలో డెలివరీ చేయించింది. అక్కడ నుంచి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న వారికి బిడ్డను అప్పగించింది.వారు చెన్నై తీసుకు పోయా రు. అసుపత్రి నుంచి వచ్చిన సుందరమ్మను అంగన్వాడీ కార్యకర్త విచారించడంతో విషయం బైటపడింది. కానీ పుట్టింది ఆడ మగ అన్నవిషయం తల్లికి తెలీక పోవడం విశేషం.పోలీసుల చొరవతో బిడ్డను వెనక్కి తెచ్చి శుక్రవారం సాయంత్రం అప్పగించా రు.తల్లి బిడ్డను చైల్డ్ వెల్ఫేర్ హెూంకు పంపారు.వెంకట లక్ష్మి పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment