Followers

అడుగడుగునా అపారిశుధ్యం


ఏ బ్లాకులో చూసినా మురుగునీరు ప్రవాహం
ఇళ్ల మధ్య పందుల స్వైర విహారం


వార్డు పర్యటనలో వైసీపీ అభ్యర్థి దృష్టికి వాంబే కోలనీ సమస్యలు
స్పందించిన పార్టీ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు
హుటాహుటిన  జీవీఎంసీ అధికారులతో మాట్లాడిన అభ్యర్థి
ఒక పూట అంతా స్వచ్చంద శ్రమదానం
పారిశుద్ధ్య సిబ్బందితో చేయి చేయి కలిపి శ్రమదానం చేసిన వైసీపీ కార్యకర్తలు..కోలనీ ప్రజలు


 గాజువాక, పెన్ పవర్ :  జీవీఎంసీ 65 వ వార్డు వాంబే కోలనీలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు(కేబుల్ మూర్తి)ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదే సందర్భంలో కాలనీలోని పారిశుధ్య సమస్యలను పందుల స్వైర విహారం పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆయన జీవీఎంసీ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య సిబ్బందిని అక్కడికి రప్పించారు. ఇళ్ల మధ్య పేరుకు పోయిన చెత్తా చెదారంతో పాటు మురుగును దగ్గరుండి తీయించారు.అనంతరం కాలనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తుందని ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రజా భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం నెలకొంటుంది అని అన్నారు.కాలనీ అభివృద్ధి పై పూర్తిగా దృష్టి సారిస్తానని ఇక్కడి ప్రజల్లో చైతన్యం నింపేలా అనేక కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో వార్డు శానిటరీ ఇసస్పెక్టర్ అప్పారావు, పార్టీ నాయకులు మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, జుత్తు లక్ష్మీ, లోకనాధం, మంగునాయుడు తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...