ఇల్లు వదిలి బయటకు రావద్దు...
మండపేటలో తోట పర్యటన...
మండపేట, పెన్ పవర్ :
కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అమలాపురం పార్లమెంట్ వైకాపా కన్వీనర్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని కోరారు. లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని అన్నారు. పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కోసం రూ.1000 సీఎం జగన్ అందజేస్తున్నారని అన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పరిస్థితులను తెలుసుకునేందుకు శుక్రవారం మండపేట లోని జూనియర్ కాలేజి, రైతు బజార్ ,మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వివరాలను అ డిగి తెలుసుకున్నారు.
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మునిసిపల్, రెవెన్యూ, వైద్య, పోలీసులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవడమే కాకుండా.. ఎవరైనా రోడ్లపైకి వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పి ఇంటికి పంపుతున్నారన్నారు. కరోనా చాలా ప్రమాదకరమైందని రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయని ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలి, ఒకరికి ఒకరు మీటరు దూరంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రావద్దన్నా రు. ఎప్పటికప్పుడు చేతులను సబ్బులు, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా కట్టడి కోసం సి ఎం కఠోరంగా శ్రమిస్తున్నారన్నారు.నిత్యం ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతూ వైరస్‌ను నివారించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందిస్తున్నారని తెలిపారు. భిక్షాటన చేసేవారికి భోజన సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. మండపేట లో పలువురు ఇప్పటికే ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారని వారిని అభినందించారు. అనంతరం మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ త్రిపర్ణ రాం కుమార్, వైకాపా నేతలు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, జిన్నూరి సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment