విజయనగరం, పెన్ పవర్
మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి బయటకు తిరగకండి, మీ కుటుంబాలను కాపాడుకోండి, లాక్ డౌన్ పాటిస్తూ అధికారులకు సహకరించండి అంటూ విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు, పాదచారులకు అభ్యర్థించారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలో పరిస్థితి, తన వాహనం పై వెళుతూ నగరమంతా కలియతిరిగారు. బాలాజీ జంక్షన్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనదారులను ఆపి ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా దయచేసి లాక్ డౌన్ సమయంలో బయట తిరగవద్దు అని వాహనదారులను అభ్యర్థించారు. వారికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరింత జాగ్రత్త అవసరం అని వారికి నచ్చచెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ఇంటికే పరిమితం కావాలని, నిత్యావసర సరుకులు అందుబాటులోనే ఉన్నాయి అని ఎవరు కలత చెంద వద్దని ఎమ్మెల్యే కోలగట్ల వారితో అన్నారు. అనంతరం ప్రధాన రహదారులపై నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న క్లోరిన్ పిచికారి పనులను ఎమ్మెల్యే కోలగట్ల పర్యవేక్షించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ వద్ద ఉన్న ట్యాంకర్ల తో పాటు, ఎమ్మెల్యే కోలగట్ల వ్యక్తిగతంగా మరో ట్యాంకర్ ను కూడా తెప్పించి నగరంలో ఆయా డివిజన్లలో పిచికారి పనులకు ఉపయోగించే విధంగా చూడాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మూడు లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి గుడి వద్ద ఏ ఆధారం లేని నిరుపేదలకు ఆహార పొట్లాలను ఎమ్మెల్యే కోలగట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దినసరి కూలీ చేసుకున్న వారు కానీ, రేషన్ కార్డు లేని వారు కానీ కలత చెంద వద్దని అన్నారు. అన్నార్తులకు ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు ఆయా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పైడితల్లి అమ్మవారి గుడి వద్ద పగలు, రాత్రి సమయాలలో ఏ ఆధారం లేని నిరుపేదలకు ఆహారం అందించడం జరుగుతుందన్నారు. అలాగే కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కూడా నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎక్కడైనా పేదవారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు, ఆకలి బాధతో ఉన్న వారు ఆయా ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సంప్రదించాలని, లేదా స్థానిక శాసన సభ్యునిగా తాను అందుబాటులో ఉంటానని, నాయకుల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లాక్ డౌన్ పిలుపును విజయవంతం చేస్తూ, ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉంటూ, కరోనా వైరస్ ను తరిమి కొట్టాలన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ వి వి రాజేష్, సత్త రావు శంకర్రావు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment