గిరిజనుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలి.
అరకు ఎంపీ జి మాధవి
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్ )
గిరిజన క్రీడాకారుల్లో క్రీడ ప్రతిభను ప్రోత్సహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరెన్ రిజిజును కోరానని అరకు పార్లమెంట్ సభ్యురాలు గొట్టేటి మాధవి తెలిపారు. శనివారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో యువత వివిధ క్రీడల్లో నైపుణ్యం ఉందని వారికి తగిన ప్రోత్సాహం లేక మరుగున పడి పోతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు క్రీడలు ద్వారా అవకాశాలు ఉన్నాయని. కావున గిరిజన ప్రాంతంలో క్రీడా మైదానాలు శిక్షణ శిక్షకులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. గిరిజనులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకునేలా మండల కేంద్రాల్లో క్రీడా మైదానాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. హైస్కూలు కళాశాలలో వివిధ క్రీడల పోటీల్లో గిరిపుత్రులు ప్రాముఖ్యత కనబరుస్తున్న వారికి తగిన ప్రోత్సాహం అందడం లేదన్నారు. చదువుతో పాటు క్రీడలు తర్ఫీదు ఇవ్వాలని ఆమె కోరారు. పాడేరులో వైద్య కళాశాల మంజూరు చేయడం హర్షణీయమన్నారు. వైద్య కళాశాల వల్ల గిరిజనులు వైద్య విద్య కు అవకాశం కలుగుతుందన్నారు. పట్టణాలకు పోయి వైద్య విద్య అభ్యసించడం గిరిజనులకు ఎంతో కష్టం అన్నారు. వైద్య కళాశాల వల్ల గిరిజనులు వైద్య విద్య అధిక సంఖ్యలో అభ్యసిస్తారు అని ఎంపీ మాధవి ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు . తీసుకుంటున్నామన్నారు
No comments:
Post a Comment