Followers

పిట్టగెడ్డ రంగురాళ్లు క్వారీలో ఆగని అక్రమ మైనింగ్‌.

 


పిట్టగెడ్డ రంగురాళ్లు క్వారీలో ఆగని అక్రమ మైనింగ్‌.


చోద్యం చూస్తున్న సిబ్బంది


స్టాఫ్‌రిఫోర్టర్‌ విశాఖపట్నం(పెన్‌పవర్‌)


జిల్లాలోని చోడవరం ఫారెస్టు రేంజ్‌ పరిధి లోని పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీలో అక్రమ మైనింగ్‌ జరుగుతుంది. స్మగ్లర్లు రాత్రి వేళ  అక్రమ తవ్వకాు చేసి విలువైన ఎలాక్స్‌ రంగురాళ్లను దోచుకుంటున్నారు. అధికారికంగా అటవీశాఖ సిబ్బంది కాపలా ఉంటున్నారు. అయినా స్మగ్లర్లు అత్తారింటికి వచ్చి  పోతున్నట్లు వ్యవహరిస్తున్నారు. మందిమార్బం సమ కూర్చుకుని కొండను కొల్ల గొడుతున్నారు. ఈ వ్యవహరంలో సిబ్బంది పాత్ర స్పష్టమౌతుంది.



 



ఏళ్ల తరబడి తవ్వకాలు జరుగుతున్న దాడులు నామ మాత్రంగా జరుగుతున్నాయి. ఈ నె లు 10వ తేది రాత్రి జరిగిన అక్రమ మైనింగే ప్రత్యేక  నిదర్శనం. నర్సీపట్నంకు చెందిన స్మగ్లర్లు ఈ  క్వారీలో అక్రమ మైనింగ్‌కు ప్పాడుతున్నారు. రంగురాళ్ల నిక్షేపాలు బండరాళ్ల సందుల్లో ఉండటంవల్ల మెషిన్‌ని ఉపయోగిస్తున్నారు. విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన వ్యక్తితో మైనింగ్‌ చేయిస్తుండగా స్దానికులు హడావిడి చూసి సిబ్బంది కొండ ఎక్కారు. అందరు పారిపోయారని మెషిన్‌ చేతిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని రేంజర్‌కు అప్నగించారు, నిందితునిపై కేసు నమోదు చేయకుండా పూచీకత్తుపై విడిచి పెట్టారు. ఆయనకు ఈ ఉదారత ఏంటో మరి. గత నెలలో కూడా తవ్వకాలు చేసినట్లు తెలిసింది. బేస్‌ క్యాంపు మేస్త్రి స్మగ్లర్ల అక్రమ మైనింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లు ఆరోపణలు లేక పోలేదు. పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీలో నాలు గేళ్ళుగా అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే శాశ్వత గస్తీ సిబ్డంది పాత్ర తేటత్లెలం అవుతుంది. గతంలో అక్రమ మైనింగ్‌ పై అప్పటి ఇంచార్జీ రేంజర్‌ శ్రీనివాస్‌ డిఎఫ్‌ఓ ధనుంజయ్‌రావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యా దు చేసిన విషయం తెలిసిందే. సెక్షన్‌ అధికారి ఎఫ్‌.బిఓను శిక్షణ నిమిత్తం పంపి ంచారు..ఇద్దరు శిక్షణ ముగించుకుని తిరిగి వస్తే ఎప్‌ బిఓను మాత్రం అనంతగిరి బదిలీ చేయడం విడ్డూరం. ఒక భాద్యత గ అధికారి అక్రమ మైనింగ్‌ పై ఫిర్యాదు చేస్తే ఉన్నతాదికార్లు చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యం ఏమిటో మరి


 


పిట్టగెడ్డ రంగురాళ్లు కు ముగ్దుడైన ఎన్‌.టి.ఆర్‌.ఆ తరువాతే క్వారీకు వేలం.:


పిట్టగెడ్డ క్వారీలో రంగు రాయి చూసి అప్పటి తెలుగుదేశం ముఖ్య మంత్రి నంద మూరి తారక రామారావు మంత్ర ముగ్దుడయ్యారు. 1994లో జిల్లా అంతట రంగు రాళ్ల పోబియా వచ్చింది. ఎక్కడ చూసిన అక్రమ తవ్వకాలు  లక్షల కోట్లలో వ్యాపా రం జరిగింది. ఆ సమయంలో పిట్టగెడ్డలో సేకరించిన ఎలాక్స్‌ రంగు రాయిని అప్ప టి చోడవరం ఎమ్మైల్యే మిలట్రీ నాయుడు(గూనూరు ఎర్రినాయుడు)సిఎం ఎన్‌టిఆర్‌ కు ఇచ్చారు. రంగురాయిని చూసి కలర్‌స్టోన్‌ ఇంత తేజస్సా బ్రదర్‌ అంటు అవాక్కు అయ్యారు. అప్పటి రంగురాళ్ల సనామీని తెలుసుకున్న ఎన్‌.టి.ఆర్‌. రంగురాళ్లుపై అధ్యయన కమిటీని నియమించారు. హౌస్‌ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాలో చింతపాక, పెదమదిన, పప్పుశెట్టి, సెరి సకపల్లి, కరక, గున్నెం పూడి, ఏడు రంగురాళ్ల క్వారీకు  వేలం నిర్వహించారు. పిట్టగెడ్డ క్వారీ మాత్రం రిజర్వు ఫారెస్టు లో ఉండటం వల్ల వేలం నిర్వహించలేదు.అన్ని క్వారీ కంటే పిట్టగెడ్డలో రంగు రాళ్లు అత్యంత విలువైనవి. ఈ రంగురాళ్ల ఎలాక్స్‌ జాతికి చెందడం వల్ల మార్కెట్‌  లో మంచి  గిరాకీ ఉంది. దీంతో స్మగ్లర్ల కన్ను పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీపై పడింది. నాటినుంచి పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీని స్మగ్లర్లు దోచుకుంటున్నారు. నాడు రాష్ట్రాన్ని కుదిపేసిన పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీకు రక్షణ కరువైంది. అటవీశాఖ పరిదిలో అత్యంత విలువైన ఎలాక్స్‌ రంగురాళ్ల నిక్షేపాలున్న క్వారీ కొందరు శాఖ సిబ్బంది స్వార్ధం వల్ల నిరాదరణకు గురౌతుంది. స్మగ్గర్లు పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తుంటే అలాంటి తవ్వకాలు  ఏమీ లేవని ఉన్నతాధికార్లకు సంకేతాలు పంపడం విశేషం. ఎంతో ప్రాముఖ్యత సంతరిం చుకున్న పిట్టగెడ్డ క్వారీపై ఉన్నతాదికార్లు దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తా యి.        


జిల్లా అటవీ శాఖ అధికారి వివరణ.: పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీలో జరుగుతన్న అక్రమ మైనింగ్‌ విషయం డిఎఫ్‌ఓ  సెల్వం దృష్టికి “పెన్ పవర్” తీసుకు పోగా విచారణ జరిపి  చర్యలు చేపడతామని తెలిపారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...