:
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ లోని ఒకటి, రెండు, మూడు వార్డులు లో సమస్యల సవారీ
ఇచ్చాపురం, పెన్ పవర్ : ఇచ్చాపురం మున్సిపాలిటీ లో ఒకటి రెండు మూడు వార్డులు లో సమస్యలు సవారీ చేస్తున్నాయి. పేరుకే మున్సిపాలిటీ అయినప్పటికీ అయినప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల ఉసూరుమంటున్న యి. 3 వ వార్డు ఏఎస్ పేట లో సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయి. రాళ్లు తేలిన రోడ్లతో అధ్వానంగా తయారయ్యాయి. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్న ఇచ్చాపురం పుర వీధి మీదుగా ఈ రోడ్డు ఉండటంతో వాహనాలు రాకపోకలు వల్ల మరీ అధ్వానంగా తయారయ్యాయి. రాత్రి అయితే చాలు వీధిలైట్లు వెలగక అంధకారం రాజ్యమేలుతుంది.పురాతన మున్సిపల్ అధికారుల అలసత్వం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సమస్యలు కొలువుదీరాయి. వేసవి సమీపించిన నేపథ్యంలో నీటి ఎద్దడి కూడా ఎక్కువగా ఉంది. పురపాలక సిబ్బంది ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. స్థానిక శాసనసభ్యులు ఈ పురపాలక సంఘం శీతకన్ను వేయడం తో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. సరైన పర్యవేక్షణ లేక అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యలు కూత పెరుగుతున్నాయి.రోడ్లు డ్రైన్లు ఒకటేమిటి అనేక సమస్యలు నిలయంగా మారిన ఒకటి రెండు మూడు వార్డులు దుస్థితి దయనీయంగా తయారైంది.ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఒకటి రెండు మూడు వార్డులు లో మౌలిక వసతులు కల్పించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment