Followers

ఆశ్రమ విద్యార్థి అదృశ్యంపై స్టేషన్లో కేసు నమోదు.


 




స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం,  పెన్ పవర్

 

గిరిజన ఆశ్రమంలో  చదువుకుంటున్న  విద్యార్థి  అదృశ్యం  కలకలం రేపుతోంది. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం బోధ రాళ్ల పంచాయతీ  అన్నవరం   గ్రామానికి చెందిన  వంతల నాగేశ్వరరావు కుమారుడు  మహేష్ 8  ఈనెల   9 వ తేదీ నుంచి  అదృశ్యమైనట్లు  పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది‌‌.  జీకే వీధి మండలం పెదవలస గిరిజన  సంక్షేమ శాఖ  ఆశ్రమ పాఠశాలలో  మూడవ తరగతి చదువుతున్న మహేష్  అర్ధాంతరంగా  అదృశ్యమయ్యాడు అని   తల్లిదండ్రులు  విలపిస్తున్నారు. పాఠశాలలో లేక  ఇంటికి తిరిగి రాక  ఎక్కడికి వెళ్ళాడో  అర్థం కాక  తల్లిదండ్రులు  గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేక  కొయ్యూరు పోలీసులను   ఆశ్రయించారు.  కేసు నమోదు చేసి  గాలింపు చర్యలు చేపట్టామని   పోలీసులు తెలిపారు.

 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...