Followers

జోరుగా ఖైనీ, గుట్కాలు రవాణా


(ఫైల్ ఫొటో )


ఒడిషా నుంచి పాడేరు, అరకు మీదుగా మైదాన ప్రాంతానికి


 పట్టించుకోని అధికారులు


లక్షలు ఆర్జిస్తున్న వ్యాపార్లు


 


 స్టాఫ్‌ రిపోర్టర్‌ విశాఖపట్నం (పెన్‌పవర్‌)


 


నిషేదిత ఖైనీ, గుట్కాలు  ఒడిషా నుంచి మైదాన ప్రాంతాకు జోరుగా రవాణా జరుగుతుంది. వ్యాపార్లు రహస్యంగా వ్యాన్లు ఆటోల పై ఖైనీ గుట్కాలు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పాడువా నుంచి పాడేరు, అరకు మీదుగా విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లా  వరకు ఖైనీ గుట్కాలను రవాణా చేస్తున్నారు. అనకాపల్లి, విశాఖకు చెందిన కొందరు వ్యాపారులు, రహస్యంగా వాహనాలపై తరలించి గొడౌన్లలో నిలువ చేస్తూన్నారు.  అక్కడ నుంచి వ్యాపార కేంద్రాలకు సరఫరా జరుగుతున్నాట్లు తెలుస్తుంది. గతంలో పాడువా నుంచి అనకాపల్లి తరలిస్తున్నా గుట్కా వాహనాలను పోలిసులు  అనేక సందర్బాలలో పట్టుకున్న  సంగతి తెల్సిందే. అరకు నుంచి విశాఖకు తరలిస్తుండగా ఎస్‌.కోట వద్ద భారీగా ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పోలీసులు ముందస్తు సమా చారంతో పక్కా ప్రణాళీకతో పట్టుకున్నారు. అయినా వ్యాపారులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ, చిట్టూ, తౌడు బస్తాలు, అడ్డాకులు లోడు మాటున నిషేదిత ఖైనీ, గుట్కాలు  తరలిస్తున్నారు. ప్రభుత్వం ఖైనీ, గుట్కాను నిషేధించడం తో మార్కెట్లో వీటి గిరాకీ నాలుగు రెట్లు పెరిగింది. దింతో ఒక రూపాయి నంచి మూడు రూపాయలు ఖరీదు చేసే ఖైనీ, గుట్కాలు నల్ల బజార్లో ఐదు నుంచి పది రూపాయలకు విక్రయిస్తున్నారు.  నిషేధిత ఖైనీ,గుట్కాలపై అధికారులు  దాడులు కనిపించక పోవడంతో వ్యాపారులు రెచ్చి పోతున్నారు. భారీ ఎత్తున ఖైనీ,గుట్కాలు తరలించి రహస్యంగా నగరంలో మూడు చోట్ల, అనకాపల్లిలో ఒక చోట, భీమిలిలో ఒ చోట భారీ ఎత్తున గోడౌన్లలో నిల్వ ఉంచుతున్నాట్లు విశ్వాసనీయ సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో నిషేధిత ఖైనీ, గుట్కా వ్యాపారం సాగు తున్నా, అధికారులు నిమ్మకు నిరెత్తనట్టు వ్యవహరిస్తుండం పలు అనుమానాలకు తావిస్తోందని పాలు ప్రజా సంఘాల నాయకులు భహిరంగంగానే విమర్శిస్తున్నారు. నెల వారీ మత్తులో జోగుతూ, వ్యాపారుల  జోలికి వెళ్లడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి, ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్మగ్లర్ల ఆగడాలకు ఉన్నాతా ధికారులైనా అడ్డుకట్ట వేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తూన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...