Followers

 కానరాని కార్యదర్శులు


 


 ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విధులకు ఎగనామం


పోస్టింగ్ గ్రామాల్లో.. ఉండేది మండలాల్లో


15 రోజులకోసారైనా గ్రామాల మొహం చూడని వైనం


పింఛన్లు, గ్రామ సభలప్పుడే దర్శనం


ఖాళీగా కుర్చీలు.. తలుపులు తెరుచుకోని పంచాయతీలు


ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్న క్షేత్రస్థాయి అధికారులు


మండిపడుతున్న గ్రామీణులు


పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, అమలాపురం


ప్రభుత్వానికి వారు కళ్లు, చెవులు. ఏ సంక్షేమ పథకం అమలు కావాలన్నా.... పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా వారి సహకారం తప్పనిసరి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న అధికారులెవరో కాదు గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి. ఎంతో గురుతర బాధ్యత గల ఈ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది కొరత, ఇన్‌చార్జి గ్రామాల సాకు చూపుతూ విధులకు ఎగనామం పెడుతున్నారు. మండల కార్యాలయాలకే పరిమితమవుతూ గ్రామాలకు రావడం మానేశారు. దీంతో మెజార్టీ గ్రామ పంచాయతీలకు తాళాలు పడుతున్నాయి. ఇదిలా ఉంటే మంచాల, ఇతర మండలాల్లో గ్రామ కార్యదర్శులు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదు. అమలాపురం డివిజన్ వ్యాప్తంగా గురువారం పెన్ పవర్ బృందం విజిట్ చేయగా ఇలాంటి విషయాలు ఎన్నో వెలుగు చూశాయి. గ్రామ స్థాయిలో వారు కీలకమైన అధికారులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలన్నా, అభివద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలన్నా వీరే కీలకం. క్షేత్రస్థాయిలో ఈ అధికారులు అందించే డాటా ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ అధికారులెవరో కాదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి. అందుకే ఈ ఇద్దరు అధికారులను ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోల భుజస్కంధాలపై గురుతర బాధ్యతలను పెట్టింది. క్షేత్రస్థాయిలో కీలకమైన ఈ అధికారులు సక్రమంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తే ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయి. సత్వర అభివద్ధి సాధ్యమతుంది. మెరుగైన పాలనా వ్యవస్థతో ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ.. ఆచరణకు వచ్చేసరికి ప్రభుత్వం ఆశించినదానికి విరుద్ధంగా జరుగుతోంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోజువారీగా గ్రామ పంచాయతీలకు రావడంలేదు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. వేళాపాళా లేకుండా ఇష్టం వచ్చినపుడు విధులకు హాజరవుతున్నారు. మండల కార్యాలయాలకే పరిమితమై గ్రామాలకు ముఖం చాటేస్తున్నారు. దీంతో మెజార్టీ గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలు దర్శనమిస్తున్నాయి. సిబ్బంది కొరత.. ఇన్ చార్జి గ్రామాల సాకు చూపించి విధులకు ఎగనామం పెడుతున్నారు. సర్పంచ్ లకు, ఇతర వార్డు సభ్యులకు బాధ్యులుగా ఉండటం లేదు. మరోవైపు మంచాల, తదితర కొన్ని మండలాల్లో గ్రామ కార్యదర్శులు పంచాయతీ అటెండెన్స్ రిజిష్టర్లో కూడా సంతకాలు పెట్టకుండానే జీత భత్యాలు పొందుతున్నారు. ఈ విషయం మండలస్థాయి అధికారులకు తెలిసినా గత నాలుగైదు ఏళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా గ్రామ కార్యదర్శులు జీత,భత్యాలను అడ్డగోలుగా డ్రా చేసుకుంటున్నారు. గురువారం పెన్ పవర్విలేకరులు నిర్వహించిన గ్రామ పంచాయతీల స్పాట్ విజిట్లో ఇలాంటి వాస్తవాలెన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా గ్రామస్థాయిలో కీలకంగా పనిచేసే వీఆర్వోలు స్థానికంగానే ఉండి, ప్రజలకు రోజుకు కనీసం మూడు


 


 


గంటలు అందుబాటులో ఉండాలని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీ పరిధిలోకి అన్ని పౌరసేవలను తీసుకుపోయి పల్లె ప్రజలకు పాలనా వ్యవస్థను మరింత చేరువలోకి తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో వీఆర్వోలతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండి విధులను సక్రమంగా నిర్వర్తించేలా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అయినా ఆచరణకు వచ్చేసరికి ప్రభుత్వ ఆశించినట్టుగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోల నుంచి సహకారం లభించడం లేదు. విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న వారు సిబ్బంది కొరతను, ఇన్ చార్జి బాధ్యతలను సాకుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో 1247 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం 660 మంది గ్రామ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరే మిగతా గ్రామ పంచాయతీలకు ఇన్ చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. పెన్ పవర్ విలేకరులు గ్రామస్థాయిలో వీఆర్వోలు, గ్రామకార్యదర్శుల పనితీరుపై స్పాట్ విజిట్ చేపట్టింది. ఈ సందర్భంగా అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో వీఆర్ వో, పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని స్పష్టమైంది. దీంతో పల్లె పాలన పడకేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడైంది. వెలుగులోకి వచ్చిన వాస్తవాలు... అక్కడక్కడా కొందరు వచ్చినా.. పంచాయతీ కార్యాలయాల్లో కొద్ది సేపు కూర్చొని తుర్రుమంటున్నారు. పనిదినాల్లో స్థానిక ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదు. గ్రామాల్లో ప్రజా సమస్యలను పట్టించుకుంటున్నారంటే అదీ లేదు. వేళాపాళా లేకుండా తమ ఇష్టానుసారంగా గ్రామాలకు వచ్చిపోతున్నారు. మెజార్టీ పనిదినాల్లో చాలామంది గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు మండల కార్యాలయాలకు వచ్చి అక్కడినుంచే ఇంటి బాట పడుతున్నారు. ఉన్నతాధికారుల, మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపించడంతో వారు ఆడిందే ఆట,పాటగా మారింది. కొంతమంది మండల అధికారులకు ఇదంతా తెలిసినా వారు పట్టించుకోవడంలేదు. సిటిజన్ చార్టర్ అమలుచేసే విషయంలో ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. ప్రతి నెలా మొదటివారంలో ఫించన్ల పంపిణీకి, గ్రామ సభలు ఉన్నపుడు మాత్రమే పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనిపిస్తున్నారు. దీంతో ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ పనికి అవసరమొచ్చినా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోల కోసం గ్రామీణ ప్రజలు ఎదరుచూడాల్సిన దుస్థితి. పజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు. సంతకాలు పెట్టకుండానే అడ్డగోలుగా జీతాలు మెజార్టీ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ లను కూడా లెక్కచేయడం లేదు. విధులకు హాజరయ్యే సమాచారాన్ని కూడా అందించడంలేదు. చాలాచోట్లా గ్రామ కార్యదర్శులు పంచాయతీ కార్యాలయాల్లో హాజరుపట్టికల్లో సంతకాలు చేయకుండానే జీత, భత్యాలను పొందుతున్నారు. మరికొన్ని చోట్లా విధులకు విచ్చినా, రాకున్నా అడ్డగోలుగా అటెండెన్స్ రిజిష్టర్లో సంతకాలు పెట్టి జీతాలు డ్రా చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా.. డీపీవో, పంచాయతీ అధికారులు, మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూతూమంత్రంగా డ్యూటీలు... రాజోలు నియోజకవర్గం : రాజోలు మండలంలో 21 గ్రామ పంచాయతీలకు గాను 11 కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. 20 రెవెన్యూ గ్రామాలకు గాను 14 మంది వీఆర్వోలు పని చేస్తున్నారు. మల్కిపురంలో 19 పంచాయతీలకు గాను 7 మంది కార్యదర్శులు ఉండగా వారిలో ఇద్దరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళారు. 13 రెవెన్యూ గ్రామాలకు 10 మంది వీఆర్వోలు విధులు నిర్వహిస్తున్నారు. సఖినేటిపల్లి లో 18 పంచాయతీలకు గాను 8 మంది కార్యదర్శులు, 26 రెవెన్యూ గ్రామాలకు 8 మంది వీఆర్వోలు పని చేస్తున్నారు. మామిడికుదురులో 25 గ్రామ పంచాయతీల్లో 7 మంది కార్యదర్శులు, 20 రెవెన్యూ గ్రామాలకు 14 మంది వీఆర్వోలు విధులు నిర్వహిస్తున్నారు. అమలాపురం నియోజకవర్గం : అమలాపురంలో రెవెన్యూ అధికారులు సైతం పూర్తి స్థాయిలో లేక మండల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 21 పంచాయతీలకు నలుగురు మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. ఒక్కొక్కరు సగటున ఐదు పంచాయతీల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పనిభారం వల్ల వారానికి ఒక రోజు కూడా కార్యదర్శులు పంచాయతీల్లో విధులు నిర్వహించలేకపోతున్నారు. దీంతో ప్రజలు వివిధ ధ్రువీకరణ పత్రాలు, సమస్యల పరిష్కారం కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, 28 రెవెన్యూ గ్రామాలుండగా 8 మంది వీఆర్వోలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో భూ సంబంధ సమస్యలు పేరుకుపోతున్నాయి. గురువారం పెన్ పవర్ పరిశీలనలో పలు గ్రామాల్లో అధికారులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తెలిపారు. అల్లవరం మండలంలో 21 పంచాయతీల్లో 14 మంది కార్యదర్శులు విధులు నిర్వహస్తున్నారు. ముగ్గురు మినహా మిగిలినవారు అదనపు బాధ్యతలు నిర్వహరిస్తున్నారు. మండలంలో వీఆర్వో 12 పోస్టులు ఉండగా 8 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల వీఆర్వోలకు అదనపు బాధ్యతలు ఉన్నాయి. మండల పరిధిలో గురువారం పెన్ పవర్ పరిశీలించగా పలు గ్రామాల్లో మధ్యాహ్నం దాటినా పంచాయతీ కార్యాలయాలు తెరుచుకోలేదు. కొందరు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఉప్పలగుప్తం మండలంలో పంచాయతీ కార్యదర్శులతో పాటు రెవెన్యూ అధికారులు సైతం పూర్తి స్థాయిలో లేక మండల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 21 పంచాయతీలకు నలుగురు మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. ఒక్కొక్కరు సగటున ఐదు పంచాయతీల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పనిభారం వల్ల వారానికి ఒక రోజు కూడా కార్యదర్శులు పంచాయతీల్లో విధులు నిర్వహించలేకపోతున్నారు. దీంతో ప్రజలు వివిధ ధ్రువీకరణ పత్రాలు, సమస్యల పరిష్కారం కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, 28 రెవెన్యూ గ్రామాలుండగా 8 మంది వీఆర్వోలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో భూ సంబంధ సమస్యలు పేరుకుపోతున్నాయి. గురువారం పెన్ పవర్ పరిశీలనలో పలు గ్రామాల్లో అధికారులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గం : అంబాజీపేట మండలంలో 29 పంచాయతీలు ఉండగా 17 వీఆర్వోలు, 10 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. అధికారుల తీసుతో ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంలో జరుగడంతో గ్రామాల్లో సమస్యలు రాజ్య మేలుతున్నాయి. అధికారులు గ్రామాల్లో నామ మాత్రంగా పర్యటనలు చేస్తూ సమస్యలు పట్టించు కోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పి.గన్నవరం మండల పరిధిలో 22 పంచాయతీలు ఉండగా ఏడుగురు వీఆర్వోలు, తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. పూర్తి స్థాయి సిబ్బంది లేక అధికారులు ఏ సమయానికి ఎక్కడుంటున్నారో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినవిల్లి మండల పరిధిలో 24 పంచాయితీల్లో 9 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. అదనపు భాద్యతలు ఉండటంతో ఏ గ్రామానికీ సక్రమంగా రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వీఆర్వోలు సైతం సొంత గ్రామాల్లో ఉంటూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కొత్తపేట నియోజకవర్గం: కొత్తపేట మండలంలో 21 పంచాయతీల్లో 14 మంది కార్యదర్శులు విధులు నిర్వహస్తున్నారు. ముగ్గురు మినహా మిగిలినవారు అదనపు బాధ్యతలు నిర్వహరిస్తున్నారు. మండలంలో వీఆర్వో 12 పోస్టులు ఉండగా 8 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల వీఆర్వోలకు అదనపు బాధ్యతలు ఉన్నాయి. మండల పరిధిలో గురువారం పెన్ పవర్ పరిశీలించగా పలు గ్రామాల్లో మధ్యాహ్నం దాటినా పంచాయతీ కార్యాలయాలు తెరుచుకోలేదు. కొందరు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. రావులపాలెం మండల పరిధిలో 24 పంచాయితీల్లో 9 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. అదనపు భాద్యతలు ఉ ండటంతో ఏ గ్రామానికీ సక్రమంగా రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వీఆర్వోలు సైతం సొంత గ్రామాల్లో ఉంటూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆత్రేయపురం మండల పరిధిలో 22 పంచాయతీలు ఉండగా ఏడుగురు వీఆర్వోలు, తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. పూర్తి స్థాయి సిబ్బంది లేక అధికారులు ఏ సమయానికి ఎక్కడుంటున్నారో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం మండలంలో 29 పంచాయతీలు ఉండగా 17 వీఆర్వోలు, 10 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. అధికారులు అందుబాటులో లేక పోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకు పోతున్నాయి. అధికారుల తీసుతో ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంలో జరుగడంతో గ్రామాల్లో సమస్యలు రాజ్య మేలుతున్నాయి. అధి కారులు గ్రామాల్లో నామమాత్రంగా పర్యటనలు చేస్తూ సమస్యలు పట్టించుకోవడం గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాట్రేనికోన మండల పరిధిలో 19 పంచాయతీలకు గాను 8 - మంది కార్యదర్శులు, 26 రెవెన్యూ గ్రామాలకు 8 మంది వీఆర్వోలు పని చేస్తున్నారు. మామిడికుదురులో 25 గ్రామ పంచాయతీల్లో 7 మంది కార్యదర్శులు, 20 రెవెన్యూ గ్రామాలకు 14 మంది వీఆర్వోలు విధులు నిర్వహిస్తున్నారు. తాళ్ళరేవు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు అందుబాటులోలేక ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ధ్రువ పత్రాల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు.


 


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...