పరిశ్రమల వారు లాక్ డవున్ నిబంధలను పాటించాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి
పరవాడ పెన్ పవర్
పరవాడ:మండలం లో ఉన్న పరిశ్రమల యజమానులు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డవున్ నిబంధనలను పాటించాలి సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ డిమాండ్ చేశారు.శనివారం నాడు కరోనా కారణంగా గనిశెట్టి ప్రెస్ వారికి ప్రెస్ నోట్ ద్వారా వివరాలు అందించారు.దేశంలో ఉన్న ప్రజలంతా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత దూరం పాటించండి అని ఇటు ప్రభుత్వాలు,ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు పెద్దఎత్తున ప్రచారం చేస్తుంటే కంపెనీ యాజమాన్యాలు మాత్రం తమ ఉద్యోగులను మాత్రం వ్యక్తిగత దూరం లేకుండా అధిక సంఖ్యలో వారిని బస్సులో తీసుకు వస్తున్నాయి అని ఆరోపించారు.కంపెనీల వారి ఈ నిర్లక్ష్య వ్యవహారంతో చుట్టు పక్కల గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులతో పనులు చేయించు కోవాలి అంటే వారిని కంపెనీ లోపలే ఉంచి పని చేయించుకోవాలి అని కరోనా వైరస్ తగ్గిన తరువాతే వారిని బయటికి వదలాలి అని అలా కాకుండా వారిని బయటకు పంపిస్తే వారి వల్ల కరోనా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉంది అని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని గనిశెట అన్నారు.కోన్ని కంపెనీ యాజమాన్యాలు 25 గురు పట్టే బస్సులో 10 మందినే తీసుకు వతున్నాయి అని వారికి బస్సులోనే మాస్కులు,సాని టైజర్ స్ప్రే చేస్తూ వారిని ఇంటిదగ్గర దింపే ముందు కూడా స్ప్రే చేస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు అలాంటి యాజమాన్యం ఎంతో అభినందించ దగిన వారు అని అన్నారు.టొరంటో,ర్యాక్స్ కంపెనీ ల వారు వందల సంఖ్యలో కార్మికుల తో పని చేయించడం మంచిది కాదు అన్నారు.ఈ రెండు కంపెనీల వారు ఎటువంటి సానిటరీ భద్రతలు పాటించడం లేదు అని అన్నారు.తాడి,తాణాo,లంకెలపాలెం,పరవాడ, సాలాపువాని పాలెం,గ్రామాలకు చెందిన కార్మికులు ఫార్మా కేంద్రంలో బల్క్ కంపెనీలకు కూడా పనులకు వెల్లడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు.144 ఫోర్ సెక్షన్ అమలులో ఉండగా చుట్టు ప్రక్కల గ్రామలనుండి ఇంతమంది కార్మికులు ఎలా తిరుగుతున్నారు అని ప్రశ్నించారు.కరోనా బారినుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడటానికి కoపెనీల యాజమాన్యాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి, పోలీసు శాఖ సిబ్బందికి, స్థానిక ప్రభుత్వరంగ సిబ్బందికి,ఆశా వర్కర్లకు,పారిశుధ్య కార్మికుల కు ప్రభుత్వం సత్వరమే మాస్కులు, శాని టైజర్స్,మెడికల్ కిట్లు తగినన్ని పంపిణి చేయాలి అని డిమాండ్ చేశారు.ప్రజల్లో ఎవరిమీద అన్నా అనారోగ్య తో అనుమానం వచ్చినపుడు వారి రక్తాన్ని సేకరించడానికి తగిన సామగ్రిని ప్రభుత్వం సమకూర్చాలి అని డిమాండ్ చేశారు.ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు వాలంటీర్ల ద్వారా ఇళ్లకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అని గనిశెట్టి సత్యన్నారాయణ అన్నారు.
No comments:
Post a Comment