Followers

 పగలు ఎమ్మెల్యే వద్దన్నాడు ...... రాత్రికి మంత్రి ఆహ్వానించాడు....

 



 


 


ముఖ్యమంత్రిని కలిసిన దారపునేని


తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న వైసీపీ కార్యకర్తలు


పామూరులో చక్రం తిప్పనున్న దారపునేని


దశాబ్దాల ప్రత్యర్థులు ఒక్కటైనట్లేనా !


 


కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలం 'టీడీపీ నేత దారపునేని చంద్రశేఖర్ వైసీపీ ఎంట్రీ సుఖాంతమైంది. పలు నాటకీయ పరిణామాల మధ్య ఆయన ఆహ్వానించాడుదారపునేని దెబ్బతిన్నాయంటున్న దారపునేని ! కరోనా బారినపడకుండా ప్రజల్లో వైసీపీలో చేరారు. పగలు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వద్దన్నాడు....రాత్రికి రాష్ట్ర మంత్రి బాలినేని పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలిశాడు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.


(పెన పవర్, కనిగిరి ఆర్ సి ఇన్‌ఛార్జి)


ప్రధానంగా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తో పాటు పామూరు మండల వైసీపీ పార్టీ బాధ్యతలు చూస్తున్న ప్రధాన నాయ కులు, కార్యకర్తలు దారపునేని ని వ్యతిరేకించినప్పటికీ ఉపయో గం లేకుండా పోయింది. అధిష్టానంలో ఎమ్మెల్యే మాటకు విలువ లేదా అని నాయకులు బహిరంగంగానే  చర్చించుకుంటున్నారు. కాని పామూరు మండల నేతలు మాత్రం ఈ తతంగమంతా ఎమ్మెల్యేనే నడిపించారని, ఎమ్మెల్యేకు తెలిసే ఆయన పార్టీలో చేరాడని మండల నాయకులు వారి అభిప్రాయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఇదిలా ఉంటే అక్కడ దశాబ్దాల పాటుగా ప్రత్యర్థులుగా ఉండే బొల్లా మాల్యాద్రి చౌదరి, దారపునేని చంద్రశేఖర్లు ఇద్దరు ఒక్కటై కలిసి పని చేస్తారా అనేది అనుమానమే. ఇప్పటి వరకు దారపునేని తెలుగుదేశంలో ఉండగా మాల్యాద్రి చౌదరి వైసీపీ మండల బాధ్యతలు చూస్తున్నారు. వారిరువురు కలిసి ఇప్పుడు వైసీపీలో పని చేయాలి. ఇద్దరు కలిసి పని చేస్తారా లేక విభేదించుకుంటారా అనేది సందేహం. అయితే తెలుగుదేశం హయాంలో పామూరులో చక్రం తిప్పిన దారపునేని ఇప్పుడు వైసీపీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతారని ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన బొల్లా మాల్యాద్రి చౌదరి, హుస్సేన్‌ రెడ్డిల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ కార్యకర్తలు దారపునేనిని విభేదించినప్పటికీ ఆయనను పార్టీలో చేర్చుకోవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నట్లు కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. మంత్రి బాలినేని ఏకంగా ముఖ్యమంత్రి చేత కండువా కప్పించడంపై వారు భగ్గుమంటున్నారు. అయితే పామూరులో రాజకీయం ఏ రంగులు మారబోతుందో వేచి చూడాల్సిందే. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...