Followers

నగరం హై అలర్ట్...

 


 

కరోనా తొలి పాజిటివ్ కేసుతో అప్రమత్తమైన అధికారులు


అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి వైరస్


చెస్ట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స


అతని నివాస ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు


అల్లిపురం అష్టదిగ్బంధం


అన్ని రహదారులు మూసివేత


ప్రజలను ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి


114 బృందాలతో 7,800 గృహాల జల్లెడ


అనుమానితులకు వైద్య పరీక్షలు


 


(బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం )


నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో తొలి పాజిటివ్ కేసు బయటపడడంతో ఏపీ వైద్యశాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి వైరస్ సోకిందని తేలడంతో సిబ్బంది ఆయన నివాసం ఉన్న ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మక్కా వెళ్లిన ఈ వృద్ధుడు వారం క్రితమే తిరిగి వచ్చాడు. మూడు రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో ఛాతి ఆసుపత్రిలో చేరాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా అటువంటి లక్షణాలతోనే రావడంతో వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కి పంపించారు. గురువారం  అక్కడి నుంచి నివేదిక రాగా వృద్ధుడికి పాజిటివ్ అని తేలింది. దీంతో వృద్ధుడిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో వుంచి చికిత్స అందించడంతోపాటు అతను నివాసం ఉన్న ప్రాంతంలో వైద్యబృందాలు సర్వే చేస్తున్నాయి. ఈ వృద్ధుడు ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడికి వెళ్లాడు? తదితర అంశాలపై ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వృద్ధుడి నివాస ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి అల్లిపురం వైపు వచ్చే కర్ రహదారులను మూసివేశారు. డాబాగార్డెన్స్ వైపు నుంచి, డీఆర్ఎం కార్యాల యం నుంచి, రైల్వే స్టేషన్ నుంచి అల్లిపురం వైపు వచ్చే రహదారులను పోలీసులు మూసివేశారు. ఆ ప్రాంతంలోని ప్రజలను ఇళ్లలోనే వుండాలం టూ పోలీసులు విజ్ఞప్తి చేసారు. స్థానికులను బయటకు రానీయడంలేదు. బయటి వ్యక్తులను లోపాలకి వెళ్లనివ్వ డంలేదు. వ్యాపార దుకాణాలను సైతం మూసివేయిస్తున్నారు. ముందుజాగ్రత చమీడియా ర్యలలో భాగం గానే ఇవాన్ని చేపట్టినట్లు పోలీస్ అధికారులు చెప్తున్నారు.  ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఆశవర్కర్లు, వలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మొత్తం 7,800 ఇళ్లను జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. స్ప్రేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీఎంహెవో కోరారు...నగరమంతా కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి.బయటకు వచ్చిన ప్రతీ ఒక్కరూ మాస్క్ వేసుకొని కనిపిస్తోన్నారు. ఒక వైపు ప్రజలు ఆందోళన ,భయం తో ఉండగా కొంతమంది సోషల్ మీడియాలో కరోనా సోకినా వ్యక్తి చనిపో యాడని, మరో చోట కరోనా కేసు నమోదయ్యిందంటూ ప్రచారాలు చెయ్యడం మొదలు పెట్టారు.దేంతో ఏది నిజమో ఏది అబద్దమో తెలియక జనం మరింత భయబ్రాంతులకు గురౌతున్నారు .


పుకార్లు, తప్పుడు ప్రచారం చేస్తే జైలే !


కరోనాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కానీ, ప్రకటనల రూపంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన వ్యక్తం అవుతుందని, ఇది ఏమాత్రం మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే వారిపై జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1, ఎడీఎమ్ యాక్ట్ సెక్షన్ 54 కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ సెక్షన్ కింద ఏడాది జైలు, భారీ జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలో కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. మెడికల్ షాపుల్లో దొరకని శానిటైజర్లు, మాస్కలు కరోనా వైరస్ గురించి ప్రచారం ఎక్కువైన తరువాత ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి కుటుంబం చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లు కొనుగోలు చేయడం ప్రారంభించాయి. దాంతో షాపుల్లో స్టాకు మొత్తం అయిపోయింది. ఇప్పుడు అవి ఎక్కడా దొరకడం లేదు. సాధారణంగా డాక్టర్లు మాత్రమే ప్రతిసారి చేయి కడుక్కోవడం కోసం శానిటైజర్లు వాడతారు. ఇప్పుడు అంతా వాటిని కొనుగోలు చేయడంతో ఎక్కడా లభించడం లేదు. మరోవైపు ముఖానికి కట్టుకునే మాస్క్ లు కూడా మార్కెట్లో విక్రయించడం లేదు. ప్రస్తుతం నగరంలో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి .



 

* *అల్లిపురంలొ వైద్య బ్రుందం జల్లెడ.**

సత్తార్ విశాఖపట్నం నుంచి మక్కాకు ఎప్పుడు వెళ్లారు ఎప్పుడు వచ్చారు. ఎక్కడ  ట్రీట్మెంట్ తీసుకున్నారు. వారందరి వివరాలు అధికారులు సేకరించారు జబ్బు వారికెవరికైనా సోకిందా అనే కోణంలో ప్రభుత్వ అధికారులు  దర్యాప్తు మొదలుపెట్టారు. రైల్లో తిరుగు ప్రయాణంలో పక్క పక్కనే ఉన్న వారు. మర్రిపాలెం  సురక్ష ఆస్పత్రి వైద్య సిబ్బంది. సత్తార్ కుటుంబ సభ్యులు. తన దగ్గరకు వచ్చిన బంధువులు. తన ఇంటి దగ్గర పరిసరప్రాంతాలు వారికి ఉదయం నుంచే పరీక్షలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు గానీ ఇతరులకు  ఎటువంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత పకడ్బందీగా చర్యలు  తీసుకుంటున్నారు. దేశంలో ఎప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ముగ్గురికి కరోనా ఉన్నట్లు నిర్ధారించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...