సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యన్నారాయణ
పరవాడ పెన్ పవర్
మండలం లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజలు కరోనా పేరుతో కంగారు పడుతున్నారు అని ఈ కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవద్దు అని సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ అన్నారు.శనివారం నాడు ఫార్మాసిటీ కార్మికులకు,గొర్లివానిపాలెం ఉపాధి హామీ కార్మికులకు,మండలంలో పలు రద్దీ ప్రాంతాల్లోని ప్రజలకు కరోనా వ్యాధి గురించి కరపత్రాలు పంచుతూ అవగాహన కలిగిస్తూ ప్రచారం చేసారు.కరోనా వ్యాధి గాలినుంచి వ్యాపించేది కాదు కనుక ప్రజలు ఆందోళన చెందనవసరం లేదు అని ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధి అని తెలియ చేసారు.ఇది మనదేశంలో పుట్టిన జబ్బు కాదుగాని ఛైనా దేశంలో పుట్టి ఛైనా నుంచి విదేశాల్లోకి విస్తరించి ఆ విస్తరించిన దేశాల్లోంచి ఎవరో ఒకరు మనదేశం రావడం వల్ల మనదేశంలోకి ప్రవేశించింది అని అన్నారు.ఈ వ్యాధి సోకిన వ్యక్తి కి దగ్గు,జలుబు,జ్వరం వస్తాయి అని వాటితోపాటు స్వాస తీసుకోవడం లో కూడా సమస్యలు వస్తాయి అని తెలియచేసారు.ఈ వ్యాధి సోకిన వ్యక్తి కి ఈ లక్షణాలు అన్ని మామూలు జలుబు జ్వరం అని అనుకోని జనసంచారం కలిసిపోయి అందరితో కలివిడిగా తిరగడం వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది అని కావున ఇలాంటి లక్షణాలు వున్న వ్యక్తులు సమాజం పట్ల వ్యక్తిగత బ్యాద్యతతో డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి అని కోరారు.ఎలా అయితే జలుబు చేసిన వ్యక్తి వాడిన వస్తువులు వాడటం వలన,ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలగడం వలన,ఆ వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము ఉయడం వలన ఈవ్యాధి వ్యాప్తి చెందుతుంది అని అవగాహన కలిగించారు.ఇటువంటి లక్షణాలు వున్నవ్యక్తి బయటతిరగకుండా మొహానికి మాస్క్ ధరించి ఇంటిలోనే వుండి వైద్య చికిత్స చేయించుకోవాలి అని సూచించారు.మీ ఇంటి పక్కన లేదా రోడ్డుమీద ఈ లక్షణాలు వున్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా సంచరిస్తూ ఉంటే మీ దగ్గరలో వున్న వైద్య బృందానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ పోలీస్ వారికీ కానీ తెలియచేయడం వలన ఈ వ్యాధిని నివారంచడంలో మీకు మీ ఊరికే కాకుండా దేశానికే మేలు చేసినవారు అవుతారు అని వారిని జాగృతం చేసారు.ప్రతి వక్కరు తమ కుటుంభం పట్ల సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ వ్యక్తిగత జాగ్రతలు పాటించాలి అని అన్నారు.ప్రతి వక్కరు తప్పకుండా ముఖమునకు మాస్క్ ధరించాలి అని మాస్క్ ఒకసారి ధరించిన తరువాత తిరిగి మాస్క్ ముట్టుకొనే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుగుకున్నాక మాత్రమే మాస్క్ ను ముట్టుకోవడం చేయాలి అని తెలియచేసారు.ప్రతివక్కరు గోరు వెచ్చని నీరుని కానీ మంచినీరు ని ప్రతి 15 ని లకు త్రాగుతూ ఉండాలి అన్నారు.దేశ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూ కార్యకంలో అందరూ భాగస్వాములు అవుతూ ఉదయం 7 గం నుండి రాత్రి 9 గం వరకు ఎవరు వారివారి ఇంటినుంచి బయటకు రాకుండా ఈ వ్యాధి నివారణలో భాగస్వాములం అవుదాము అని పిలుపునిచ్చారు.అందువలన అధివారంనకు కావలిన సత్యవసర సరుకుల ను ముందే ఖరీదు చేసుకోవాలి చెప్పారు.ప్రతి వక్కరు ఈ జాగ్రత్తలు పాటించి ఆరొగ్య వంతమైన సమాజం కోసం ప్రతివక్కరం కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రంలో కె పోతురాజు,పి చిన్నారావు,జి అప్పారావు,వై శ్రీను,కార్మికులు,ప్రజలు పాల్గొన్నారు. ,
No comments:
Post a Comment