Followers

పేదల ఆకలి తీర్చడం అభినందనీయం:  ఎస్.ఐ రవీంద్రారెడ్డి


పేదల ఆకలి తీర్చడం అభినందనీయం:  ఎస్.ఐ రవీంద్రారెడ్డి


బేస్తవారిపేట , పెన్ పవర్
                       ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చడం అభినందనీయమని, అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని బేస్తవారిపేట SI ఎస్.వి. రవీంద్రారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని స్థానిక గ్రామ సచివాలయం ఎదుట బేస్తవారిపేట-2 ఎంపీటీసీ గుంటి స్వప్న, ఆమె తమ్ముడు వినోద్ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లు మరియు వాటర్ ప్యాకెట్లు వాటర్ ప్లాంట్ శ్రీను అందించగా గుంటి చిరంజీవి, వినోద్ శుక్రవారం బేస్తవారిపేట పారిశుద్ధ్య కార్మికులకు పులిహోర ప్యాకెట్లు మరియు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బేస్తవారిపేట SI రవీంద్రారెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆకలి తీర్చడం అభినందనీయం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో పట్టణంలో టీ దుకాణం మొదలుకొని పెద్ద పెద్ద హోటళ్ల వరకు అన్నింటిని మూసేయడం జరిగింది. దీంతో తినేందుకు తిండి లేక అనాధలు, యాచకులు, వృద్దులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలితో ఉన్న వారికి భోజనం అందించడం చాలా గొప్ప విషయం, మంచి కార్యక్రమం అని దాతలను కొనియాడారు. ఈ సందర్బంగా గుంటి చిరంజీవి మాట్లాడుతూ.. కొరోనా వైరస్ కట్టడి చేసేందుకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది పేదలు, యాచకులు తినేందుకు తిండి లేక బాధపడుతున్నారని వారిని దృష్టిలో పెట్టుకొని భోజనం అందిస్తున్నామన్నారు. ఈనెల 22వ తేదీ కర్ఫ్యూ రోజు నుండి బేస్తవారిపేట, కంభం పట్టణాల్లో ఇలా భోజనం అందిస్తున్నామని, అలాగే లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పేదలకు, యచకులకు భోజనం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటి.చిరంజీవి, వినోద్, ముప్పూరి శ్రీను, కంచి.సురేష్, వాటర్ ప్లాంట్ శ్రీను మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...