కారోనా మహమ్మారిని తరిమికొడదాం -ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
జగ్గంపేట, పెన్ పవర్:
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కారోనా మాహమ్మారిని తరిమికొడదాం జగ్గంపేట ఎమ్మెల్యే చంటి బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు జగ్గంపేట జంక్షన్ లో ఆయుర్వేదిక్ ఔషధ మైన వేపాకును నాలుగు రహదారుల కూడలిలో తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు రక్షణ శాఖ పాత్రికేయులు కారోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటంలో చేస్తున్న సేవ కు విలువ కట్టలేని ఎమ్మెల్యే అన్నారు. పూర్వకాలంలో ఆరోగ్యం కాపాడుకోవడానికి వేపాకును ఉపయోగించేవారని ప్రస్తుత ఇప్పుడు కూడా అనేక ఔషధాలు లలో వాడుతున్నారు. వైరస్ ను దూరం చేయడానికి వేపాకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. మాస్కులు ధరించి దూరం పాటించాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓమ్ని రఘురాం, బండారు రాజా, అత్తులూరి నాగబాబు, తోట రవి, బేకరీ బాబు తదితరులు ఆయన వెంట ఉన్నారు.
No comments:
Post a Comment