కాకినాడ సిటీ : ప్రయివేటీకరణ కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని కాపాడుకుందామని పిడిఎఫ్ ఎంఎల్ సి ఐ.వెంకటే శ్వరరావు పిలుపునిచ్చారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా 5వ మహాసభలు ఐడియల్ కళాశాల ప్రాంగణంలో గుబ్బల వెంకటరమణ అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలకు ఐవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి పాలకులు వైద్య సేవలను ప్రయివేటీకరించేందుకు చూస్తున్నారన్నారు. వైద్య, ఆరోగ్య రంగం నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. అందులో భాగంగానే ఖాళీ పోస్టులను భర్తీ చేయట్లేదని విమర్శించారు. పిడిఎఫ్ ఎంఎల్‌సిగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు. పిఆర్ సి, డిఎ, సిపిఎస్ రద్దు వంటి సమస్యలపై శాసన మండలిలో ఉద్యోగుల తరపున పోరాడతామన్నారు. వీటి సాధన కోసం ఐక్యపోరాటాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పలివెల శ్రీనివాసరావు మాట్లాడుతూ యూనియన్ ఏర్పడిన 2004 నుంచి చేసిన పోరాటాల ఫలితంగా వేలాది మంది కాంట్రాక్ట్ నర్సులు, ఫార్మాసిస్టులు, వైద్యులు, పిహెచ్ సి సిబ్బంది రెగ్యులర్ అయ్యారని తెలిపారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన సిబ్బంది, డాక్టర్ల నియామకాలను చేపట్టకపోవడం వల్ల ఉన్న కొద్దిపాటి సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి పడుతుందన్నారు. తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ | చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా శేషబాబ్ది, ఎపి స్టేట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.దయామణి, జి.భవాని మాట్లాడారు. రాష్ట్రంలో తీసుకుందికరోనా వైరస్ విజృంభిస్తే అడ్డుకునే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం, | వైద్య వనరులు రాష్ట్రంలో అందుబాటులో లేవన్నారు. వైరస్ వ్యాపించ | కుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలపై లైంగిక | సినిమా వేధింపులను అరికట్టాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి | సమాన వేతనం చెల్లించాలని, ఇప్పటి వరకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ | మేరకు పలు తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యదర్శి కార్యక్రమాలను నివేదికను జిల్లా కార్యదర్శి డిఎ.రత్నరాజు ప్రవేశపెట్టారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికైంది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా డిఎ.రత్నరాజు, చీకట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎమ్ డి ఇబ్రహీంసాహెబ్, పలివెల వారిపై శ్రీనివాసరావు, రాధాకృష్ణ, జిజిహెచ్ సురేష్, సహాయ కార్యదర్శులుగా కార్యక్రమాల్లో విల్సన్, జోగిరాజు, భవాని, కవీంద్ర, యోహాను, కోశాధికారిగా పి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు |
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment