లాక్ డౌన్ తో పరేషాన్ అవుతున్న ఖాకీలు.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
లాక్ డౌన్ నిర్వహణలో పోలీసులు పరేషాన్ అవుతున్నారు. రాత్రి పగలు ఎండ వాన లేకుండా పికెటింగ్ చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. కానీ వారి ఆరోగ్య పరిస్థితులు వర్ణనాతీతంగా మారాయి. బిపి షుగర్ వంటి వ్యాధిగ్రస్తుడైన 24*7 కరోనా డ్యూటీ చేయక తప్పడం లేదు. కొందరు అనారోగ్యం పాలవుతున్న సందర్భాలు లేకపోలేదు. కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరగాలంటే పోలీసుల పాత్ర తప్పనిసరి. 24వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజలు సామాజిక భద్రత పాటించకపోవడంతో కరోనా అదుపునకు పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు పటిష్టం చేశారు. దీంతో పోలీసులు ప్రధాన కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు.కరోనా వైరస్ కు ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ రోడ్లపై కాపలా కాస్తున్నారు. ప్రమాదకరమైన వైరస్ మహమ్మారి ఎక్కడ ఎలా సోకుతుందొ అన్న భయం కూడా లేకుండా ప్రజల కోసం పాటుపడుతున్న. కొందరు అనారోగ్యం పాలవుతున్నారు సంఘటనలు లేకపోలేదు. శనివారం జిల్లాలోని గాజువాక ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక పోలీస్ సొమ్మసిల్లి పడిపోయారు. తోటి పోలీస్ మాత్రమే సపర్యలు చేయగలిగారు. ప్రజల కోసం ప్రాణాంతక వైరస్ ని తరిమికొట్టాలని అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ అన్నకు షెల్యూట్.
No comments:
Post a Comment