జగ్గంపేట, పెన్ పవర్
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సామాజిక దూరం పాటిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మానవాళి పై విజృంభిస్తుంటే సామాజిక మాధ్యమాల ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు, దాంట్లో భాగంగా మా యొక్క జ్యోతుల నెహ్రూ పౌండేషన్ జగ్గంపేట నియోజకవర్గం లోని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఫౌండేషన్ కారోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచార రథం ద్వారా ప్రచారం చేయించుకోవడానికి పోలీసు వారి అనుమతి కోసం ప్రభుత్వానికి చలనాలు కట్టి పర్మిషన్ కోరుకుంటే దానిని తిరస్కరించడం జరిగిందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గంపేటలో వందలాది మందితో వ్యాప ఆకులు తగలడితే, పోలీసుల దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించారని, మరి మాకు ఒక ప్రచార రథం పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా పోలీసు వారిని అడుగుతున్నాను అని అన్నారు. కలెక్టర్ గారికి పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకొని కలెక్టర్ గారు ద్వారా అయినా పర్మిషన్ సాధించి ప్రచారం చేపడతామన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోజు పత్రికా సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నారన్నారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయలేకపోతున్నారని, ప్రజల్లో నేనున్నానని ధైర్యం నింప లేక పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అప్పలరాజు మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం పాండ్రంగి రాంబాబు కొత్త కొండ బాబు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment