నిబంధనలు అతిక్రమించి నందుకు ఫలితం..
దుకాణానికి ఐదు వేలు జరిమానా..
మండపేట, పెన్ పవర్:
మండపేట పట్టణంలో ప్రజల అత్యవసారాలుకు కావాల్సిన దుకాణాలు మాత్రమే తెరవాలని కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఆదేశించిన సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం అవసరమైన దుకాణాలతో పాటు లేనివి కూడా తెరచుకుని కూర్చున్నారు. సంధు దొరికిందని వాళ్ళతో పాటు కలిసి వ్యాపారం చేయసాగారు. కమిషనర్ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రతి రోజు తనిఖీలు నిర్వహించి నట్టుగానే శుక్రవారం వారం కూడా దుకాణాలకు వెళ్లారు. షాప్ లు తెరవమని మీకు ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు. తెరిస్తే జరిమానాలుంటాయని ప్రచారం చేసినప్పటికీ వినిపించు కోక పోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఒక్కో షాప్ కి రూ. 5 వేలు చొప్పున జరిమానా విధించారు. అదేవిధంగా అపోలో ఫార్మసీ ని కూడా తనిఖీ చేశారు. ఒక రకమైన లైసెన్స్ లేదని అపోలోను మూఇంచి వేశారు.
No comments:
Post a Comment