:
పెన్ పవర్ పాడేరు : .విశాఖ ఏజెన్సీకి ప్రధాన కేంద్రమైన పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసిందని అరకు పార్లమెంటు సభ్యురాలు గొట్టే టి మాధవి తెలిపారు ఆది వారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మూడు మెడికల్ కళాశాలను మంజూరు చేసిందని అందులో ఒకటి విశాఖ ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన పాడేరులో ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఆధునికమైన మెడికల్ కళాశాలను నిర్వహిస్తామన్నారు ఆధునిక పరికరాలు మెడికల్ కళాశాలలో వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్న అన్నారు. ఈ ప్రాంత గిరిజనులకు ఆధునిక వైద్యం అందడమే కాకుండా వైద్య వృత్తిలో పట్టభద్రులు అవకాశం లభిస్తుందన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో మన్యం పాడేరు కు మహర్దశ కలుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకూలమైన ప్రాంతంలో జనులకు వైద్య కళాశాల మంజూరు చేయడంపై మాధవి హర్షం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment