కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్రంలో ఈ నెల 31వ వరకూ లాక్ డౌన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
జిల్లాలో ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర సేవల కల్పన కు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశం.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలక్టర్ లు , ఎస్ పీలతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్
స్టాఫ్ రిపోర్టర్ కాకినాడ, పెన్ పవర్
ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలక్టర్ లు , ఎస్ పీలతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన దృష్ట్యా చేపట్టవల్సిన చర్యలను సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల్లో జనతా కర్పూ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇదే రీతిలో ఈ నెల 31వ తేదీ వరకు సోషల్ డి స్టెన్సింగ్ కొనసాగించాలని సూచించారు. జిల్లాలో ఆటోలు, టాక్సీలతో సహా పబ్లిస్ ట్రాన్స్ పోర్టు పూర్తిగా నిలిపివేయాలని, అత్యవసర వైద్య సహాయం కొరకు, గర్భిణులు తరలింపు మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. నాన్ ఎసెన్షియల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్స్ అన్నిటినీ మూసివేయాలని ప్రభుత్వ శాఖలు కనీస అవసర సిబ్బంది తో మాత్రమే పని చేయాలని సూచించారు. ప్రజలు ఇళ్ళలోనే ఉండి సామాజిక దూరం విధి గా పాటించేలా కోరాలన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఐసొలేషన్ సదుపాయం ఏర్పాటు చేయాలని జిల్లా ఆసుపత్రులు , టీచింగ్ ఆసుపత్రుల్లో గే కనీసం 200 పడకలు అనుమానిత, పాజిటివ్ కేసుల చికిత్స కోసం కేటాయించాలని అన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తులందరినీ ట్రాక్ చేసి 14 రోజుల పాటు తమ ఇళ్ళలో స్వీయ నిర్బంధాన్ని తప్పనిసరిగా పాటించేలా చూడాలని, ఇంటి వద్ద ఈ వసతి లేని వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో చేర్చాలన్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో అత్యవసర వస్తువులు ప్రజలకు లోటు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు అన్ని జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించామని, నిత్యావసర వస్తువులు , మందులు ధరలు పెరగకుండా చర్యలు చేపట్టాలని , బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలక్టర్ అధి కారులతో సమీక్ష నిర్వహించి లాక్ డౌన్ కాలంలో అత్యవసర సేవలు, సరఫరాలు నిర్వహణ పై ఆదేశాలు జారీ చేశారు. వైద్య పరమైన అంశాల కోసం ఏర్పాటు చేసిన రీతిలోనే ప్రజల వైద్యేతర అవసరాలు పరిరక్షించేందుకు కలక్టరేట్ లో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సోమవారం నుండి నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా యస్ పి అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలక్టర్ జి.లక్ష్మిశ , జేసి-2 జి.రాజకుమారి, డియం హెచ్ ఓ డా.బి.సత్యసుశీల, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.రాఘవేంద్రరావు, డిఐఓ డా.మల్లిక్, డిఆర్ సిహెచ్.సత్తి బాబు, తదితరుల పాల్గొన్నారు.
No comments:
Post a Comment