స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం, పెన్ పవర్
పార్టీ అనుమతి లేకుండా నామినేషన్ ఉప సంహరించుకు న్నందుకు అభ్యర్థిని సిపిఐ పార్టీ శాశ్వతంగా బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే కొయ్యూరు మండలం బాలారం ఎంపీటీసీ సెగ్మెంట్ల కు సిపిఐ పార్టీ తరపున అభ్యర్థిగా వియ్యపు నానాజీ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఉప సంహరణలొ సిపిఐ పార్టీ నేతల అనుమతి లేకుండా స్వయంగా తన నామినేషన్ను విత్ డ్రా చేసుకున్నాడు. ఈ పరిస్థితి తెలుసుకున్న సిపిఐ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ సహాయ కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ మండల కార్యదర్శి ఇరు వాడ దేవుడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నియమ నిబంధనలను తుంగలో తొక్కి సిపిఐ పార్టీ ద్వారా వేసిన నామినేషన్ స్వతహాగా ఉపసంహరిం చుకోవడా అపరాధం గా భావించి పార్టీలో కొనసాగే అర్హత కోల్పోయినట్లు ప్రకటించి జీవితకాలం నిషేధించారు. మండలంలోని కంఠం గ్రామానికి చెందిన వియ్యపు నానాజీ చాలా కాలంగా సిపిఐ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. పార్టీకి ఎనలేని సేవలు అందించినప్పటికీ పార్టీ గుర్తు పై నామినేషన్ దాఖలు చేసి పార్టీ అధిష్టానం అనుమతులు లేకుండా నామినేషన్ ఉపసంహరణ కారణంగా పార్టీకి దూరం కాక తప్పలేదు.
No comments:
Post a Comment