కరోనా కలకలంతో కొంపకు చేరుకోలేని వలస కూలీలు
త్రిపురంతకం, పెన్ పవర్
కరోన మహమ్మారి దెబ్బకు మద్యలోనే ఉండిపోయి స్వగ్రామానికి వెళుతుండగా చెక్ పోస్ట్ లో చిక్కుకున్న 3000 మంది వలస కూలీల కథఇది.................
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గుట్ల ఉమ్మడివరం చెక్ పోస్ట్ కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై మూడువేల మంది వలస కూలీలు పిల్ల పాపలతో నీళ్ళు తిండి లేక అవస్థలు పడుతున్నారు. పోలీసులు మాత్రం జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని అంటున్నారు. ఈ మూడు వేల వలస కూలీలు రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి గుంటూరు జిల్లాలో మిర్చి కోతలకు వలస వచ్చారు. కరోన ఎఫెక్ట్ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికారులు మీ ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఆదేశించడంతో వీరు స్వ గ్రామాలకు వెళ్ళేందుకు వంద వాహనాలలో బయలుదేరి వచ్చి ప్రకాశం గుంటూరు బోర్డర్ లోని చెక్ పోస్ట్ వద్ద చిక్కుకున్నారు. ఉన్నచోట గుంటూరు జిల్లా అధికారులు ఉండనివ్వలేదని ...సొంత గ్రామాలకు వెళతామంటే ప్రకాశం జిల్లా అధికారులు కనికరించడం లేదని వలస కూలీలు వాపోయారు.
No comments:
Post a Comment