మున్సివల్ ఎన్నికల పోరు పై వైసీపీ వ్యూహ రచన
పెన్ వవర్, మండపేట: మండపేట వురపాలక సంఘం ఎన్నికల బాధ్యతను వైసిపి అధిష్ఠానవర్గం అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు తోట త్రిమూర్తులు పై భారం మోపినట్లు విశ్వసనీయ సమాచారం. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనను ఈ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ తరుణంలో అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచిన తోట త్రిమూర్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యతలు అప్పగించారని తెలిసింది. దీంతో తోట త్రిమూర్తులకు మండపేట పురపాలక సంఘంతో పాటు జడ్పిటిసి, ఎంపిటిసి ల అభ్యర్థుల గెలువు బాధ్యతలను తోట పై మోపారు. దీంతో తోట త్రిమూర్తులు వైఎస్సార్సీపీలో చేరినప్పటికీ ఆయనకు ప్రత్యర్థులు అడుగడుగునా అవరోధం కల్పిస్తూ వచ్చారు. తోట ఆ అవమానాలను అన్నిటినీ దిగమింగుకుని తనదైన శైలిలో వ్యూహాత్మక నేతగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి త్రిమూర్తులు మంగళవారమే తన బాధ్యతను చేపట్టాల్సి ఉంది. అయితే ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అమరావతిలో రాజ్యసభ నామినేషన్ స్ర్కూటినీలో బిజీగా ఉండటంతో తోట తన పర్యటనను గురువారం నాటికి వాయిదా వేసుకున్నారు. తొలుత ఒకటో వార్డు అయిన వీరభద్రపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తోట ప్రథమ శిష్యుడిగా పేరుగాంచిన మండపేటకు చెందిన కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సత్యసాయిబాబా ఆయన సమక్షంలో వైకాపా తీర్ధాన్ని పుచ్చుకోనున్నారు. దీంతో మండపేటలో కాపు నాయకులు మొత్తం చేరినట్టవుతోంది. అన్ని వార్డుల్లో సాయిబాబాకు ప్రధాన అనుచరగణం ఉండటంతో ఇక వురపాలక సంఘ విజయం తమకు సునా వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీకి జిన్నూరి సాయిబాబా నిష్క్రమణ నిరాశాజనకంగా మారింది. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చుండ్రు వర ప్రకాష్ లు జిన్నూరి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం ఓటు బ్యాంకును సాయిబాబా బద్దలు కొడతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని సాయిబాబా అనుచర గణం భావన. సోమవారం రాత్రి నుంచే పట్టణంలో కాపు సంఘం నాయకులకు వర్తమానాలు అందాయి. గురువారం మండపేట వర్యటనకు రానున్న తోట త్రిమూర్తులకు మనంగా స్వాగతం పలకాలని సాయిబాబా తన అనుచరులకు సంకేతాలు వంపారు. ఇక వుర పోరులో ఎవరు విజయం సాధిస్తారన్నది వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment