శ్రీకాకుళం, పెన్ పవర్
కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా లెప్రసీ కాలనీలో గల కుష్టు వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు లేకపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి విజ్ఞప్తి మేరకు సివి నాగజ్యోతి ఛారిటబుల్ సొసైటీ వారు సుమారుగా 8000 రూపాయల విలువ గల నిత్యవసర సరుకులు ఆయిల్ టిన్, చింతపండు, కందిపప్పు మొ. నవి శనివారం సాయంత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ పి.జగన్ మోహన్ రావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ నూక సన్యాసిరావు గారు, రెడ్ క్రాస్ వలంటీర్లు ఉమా శంకర్, కృష్ణ, మదీనా పాల్గొన్నారు.
No comments:
Post a Comment