Followers

144 సెక్షన్ అమలులో వుంది


144 CrPC అమలులో వుందని  అతిక్రమించి గుంపులు గుంపులుగా ఏర్పడి మత ప్రచారం చేస్తుండగా కొమ్ముచిక్కాల  గ్రామ VRO ఇచ్చిన పిర్యాదు మేరకు పోడూరు si B.సురేంద్ర కుమార్  కేసు నమోదు చేసిన పోలీసులు

 

 

ఆచంట, పెన్ పవర్

 

 

 

ఉదయం 7 గం.ల సమయం లో కొయ్యలగూడెం మండలం యర్రంపేట గ్రామానికి చెందినా సుమారు 40 మంది వ్యక్తులు  AP 29 Y 2410 నెంబర్ గల బస్సు లో పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామం వచ్చి దేశమంతటా కరోనా వైరస్ ఉండి రాష్ట్ర ప్రబుత్వం లాక్ డౌన్ మరియు Sec 144 CrPC అమలులో వుందని తెలిసి కూడా వాటిని అతిక్రమించి గుంపులు గుంపులుగా యేర్పడి మత ప్రచారం చేస్తుండగా కొమ్ముచిక్కాల  గ్రామ VRO ఇచ్చిన పిర్యాదు మేరకు పోడూరు si B.సురేంద్ర కుమార్  కేసు నమోదు చేసి సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి వెళ్లి గ్రామంలో తిరుగుచున్న 40 మంది ని అరెస్ట్ చేసి ,వారి వద్ద నుండి సుమారు  100 కరపత్రాలను, మరియు వాళ్ళు ఇక్కడికి రావడానికి ఉపయోగించిన  AP 29 Y 2410 నెంబర్ గల బస్సు ని సిజ్ చేసి పోలిస్ స్టేషన్ కి తరలించారు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ  బి.సురేంద్ర కుమార్ తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...