నెంబర్ 1 హోటల్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం
కంభం, పెన్ పవర్
కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో కంభం పట్టణంలో తినడానికి భోజనం దొరక్క అలమటిస్తున్న బిక్షగాళ్లకు, రోగులకు కొందరు యువకులు శుక్రవారం కంభం తహసీల్దార్ ఏ .శ్రీనివాసరావు, ఎస్సై. కె .మాధవ రావు చేతుల మీదుగా నెం1 హోటల్ బాబ్జి ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. లాక్ డౌన్ వల్ల హోటల్స్ మూసి వేయడం, అన్నదానం చేసే వారు లేక బిక్షగాళ్ళు, రోగులు అవస్థలు పడుతున్న విషయం గమనించి కంభం బస్టాండ్, కందులాపురం సెంటర్, అర్బన్ కాలనీ, రైల్వే స్టేషన్లలో భోజనాలు, తాగునీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్, నూరుల్లా ఖాద్రి, అజ్మతుల్లా, డాక్టర్ సద్దాం, అస్లాం, బాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment