Followers

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి


జనతా కర్ఫ్యూ ని జయప్రదం చేయండి చింతూరు ఐటీడీఏ పీవో


 


పెన్ పవర్, చింతూరు


 


మన ఆరోగ్యం - మన చేతిలోనే ఉంటుందని, కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకట రమణ పేర్కొన్నారు. ఆదివారం జరిగే జనతా కర్ఫ్యూని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల చివరి వరకు వారాంతపు సంతలు బంద్ చేయడం జరుగుతుందని అన్నారు. దేవాలయాల్లో పూజలు ప్రార్థనలు నిలుపుదల చేయాలని సూచించారు. శ్రీరామ నవమి వేడుకలను రద్దు చేశారు. చింతూరు ఐటీడీఏ పరిధిలోని దేవాలయాలు, చర్చలు, మసీదులలో జరిగే పూజలు, ప్రార్థనలు నిలిపివేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో కరోనా రాదు అని అనుకోవద్దని నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. ఈ మధ్యకాలంలో జరిగే వివాహాలకు దూరంగా ఉండాలని వీలైతే వివాహాలను రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఖాదర్ భాషా, డాక్టర్ పద్మజ, సీఐ యువ కుమార్ పాల్గొన్నారు. 


 


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...